శామ్సంగ్ గెలాక్సీ M40 vs శామ్సంగ్ గెలాక్సీ A50
శామ్సంగ్ తన గెలాక్సీ A సిరిస్ మరియు గెలాక్సీ M సిరిస్ నుండి తీసుకొచ్చినటువంటి బెస్ట్ స్మార్ట్ ఫోన్
గెలాక్సీ A50 మరియు గెలాక్సీ M40 రెండు కూడా ఒకే ధరతో లభిస్తాయి.
ఈ ధరలో ఎక్కువ లాభాలను తీసుకొచ్చే స్మార్ట్ ఫోన్ ఏది?
శామ్సంగ్ తన గెలాక్సీ A సిరిస్ మరియు గెలాక్సీ M సిరిస్ నుండి తీసుకొచ్చినటువంటి బెస్ట్ స్మార్ట్ ఫోన్లయినటువంటి, గెలాక్సీ A50 మరియు గెలాక్సీ M40 రెండు కూడా ఒకే ధరతో లభిస్తాయి. కానీ, ఒకటేమో సూపర్ అమోలెడ్ వాటర్ డ్రాప్ డిస్ప్లేతో వస్తే మరొకటి ఒక పంచ్ హోల్ LCD డిస్ప్లే తో వస్తుంది. అయితే, ఈ ధరలో ఎక్కువ లాభాలను తీసుకొచ్చే స్మార్ట్ ఫోన్ ఏది? అని తెలుసుకోవడానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్లను సరిపోల్చి వివరాలను తెలుసుకుందాము.
Surveyప్రస్తుత ధరలు
Galaxy A50 ధరలు
శామ్సంగ్ గెలాక్సీ A50 ( 4GB ర్యామ్ + 64 స్టోరేజి ) – Rs.18,490 /-
శామ్సంగ్ గెలాక్సీ A50 ( 6GB ర్యామ్ + 64 స్టోరేజి ) – Rs. 21,490 /-
Galaxy M40 ధర
శామ్సంగ్ గెలాక్సీ M40 ( 6GB ర్యామ్ + 128 స్టోరేజి ) – Rs. 19,990 /-
డిస్ప్లే
గెలాక్సీ A సిరీస్ నుండి వచ్చిన మూడు ఫోన్లలో, ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియంగా ఉంటుంది. ఈ ఫోన్ ఒక 6.4 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. సంస్థ ప్రకారంగా, ఇది ఒక 91.6 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది. ఇక శామ్సంగ్ గెలాక్సీ M40 విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల ఇన్ఫినిటీ – O డిస్ప్లేతో అందించబడుతుంది. ఇది కూడా ఇది ఒక 91.6 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది.
ప్రాసెసర్
ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ఒక Exynos 9610 ఆక్టా – కోర్ ప్రాసెసర్ మరియు జతగా 4GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ ఒక ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందించబడింది. అయితే, M 40 మాత్రం ఒక స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది మరియు రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ ప్రొసెసరు ట్రిపుల్ రియర్ కెమేరాకు చక్కగా అనుకూలిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 ఫై పైన ఆధారితంగా సరికొత్త శామ్సంగ్ one UI పైన నడుస్తుంది. అయితే, A 50 గరిష్టంగా 2.3 GHz క్లాక్ స్పీడ్ అందిస్తుండగా, M40 మాత్రం గరిష్టంగా 2.0 GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది.
బ్యాటరీ మరియు కలర్ ఎంపికలు
గెలాక్సీ A50 ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్, బ్లూ, బ్లాక్ మరియు వైట్ వంటి మూడు కలర్ల ఎంపికతో లభిస్తుంది. ఇక గెలాక్సీ M40 స్మార్ట్ ఫోన్ ఒక 3500 mAh బ్యాటరీ మరియు వేగవంతమైన ఛార్జింగ్ స్పోర్టుగల ఒక టైప్-C చార్జరుతో వస్తుంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ మరియు సి వాటర్ బ్లూ వంటి రెండు కలర్ల ఎంపికతో లభిస్తుంది.
ర్యామ్ వేరియంట్స్
గెలాక్సీ A50, 4GB/ 64GB స్టోరేజి మరియు 6GB/64GB స్టోరేజి ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. అయితే, గెలాక్సీ M40 మాత్రం కేవలం 6GB ర్యామ్ జతగా 128GB వేరియంటుతో మాత్రమే వస్తుంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్లను కూడా ఒక SD కార్డు ద్వారా 512GB వరకూ స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తాయి.
కెమేరా
గెలాక్సీ A50 మరియు గెలాక్సీ M 40 రెండు స్మార్ట్ ఫోన్లు కూడా వేనుక భాగంలో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటాయి. A50 యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా, ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ జతగా 25MP ప్రధాన కెమరాతో జతగా మరొక 5MP డెప్త్ కెమేరాని కలిగి ఉంటుంది. ఈ కెమేరా, శామ్సంగ్ యొక్క ఇంటెలిజెంట్ సీన్ ఆప్టిమైజర్ ని ఉపయోగించి, కాంట్రాస్ట్, బ్రైట్ మరియు కలర్ ను ఆప్టిమైజ్ చేస్తుంది. మునుభగంలో 25MP సెల్ఫీలే కెమెరాతో మంచి ఫోటోలను తీసుకునేలా ఉంటుంది.
ఇక M40 కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 32MP +5MP+8MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 32MP ప్రధాన కెమరా ఒక f/1.7 అపర్చరుతో ఉంటుంది. ఇంకా 5MP కెమేరా Live ఫోకస్ కోసం మరియు 8MP కెమేరా అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. అలాగే, ఇందులో అందించిన వెనుక కెమెరాతో సూపర్ స్లొమాషన్ వీడియోలను, అదీకూడా 240fps వద్ద తీసుకోవచ్చు. . ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
