Samsung Galaxy Z Fold 8 Ultra: డ్యూయల్ బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

ఈరోజు శాంసంగ్ నిర్వహించిన అన్ ప్యాక్డ్ ఈవెంట్ నుంచి తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది

Samsung Galaxy Z Fold 8 Ultra ముందు సిరీస్ కంటే స్లీక్ డిజైన్ మరియు డ్యూయల్ బ్యాటరీ తో వచ్చింది

ఫీచర్స్ మాత్రమే కాదు ప్రైస్ కూడా అల్ట్రా ప్రీమియం గానే ఉన్నాయి

Samsung Galaxy Z Fold 8 Ultra: డ్యూయల్ బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది.!

Samsung Galaxy Z Fold 8 Ultra: ఈరోజు శాంసంగ్ నిర్వహించిన అన్ ప్యాక్డ్ ఈవెంట్ నుంచి తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ముందు సిరీస్ కంటే స్లీక్ డిజైన్, డ్యూయల్ బ్యాటరీ మరియు అల్ట్రా ఫాస్ట్ చిప్ సెట్ వంటి అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫీచర్స్ మాత్రమే కాదు ప్రైస్ కూడా అల్ట్రా ప్రీమియం గానే ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy Z Fold 8 Ultra: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ ను అత్యంత స్లిమ్ అండ్ లైట్ డిజైన్‌ తో లాంచ్ చేసింది. ఈ ప్రీమియం ఫోన్‌ మడిచినప్పుడు 8.9mm మందంతో మరియు తెరిచినప్పుడు కేవలం 4.1 mm మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 215 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.

ఈ ఫోన్ లో 8 అంగుళాల ప్రధాన ఫోల్డబుల్ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది QXGA+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇందులో 6.5 అంగుళాల డైనమిక్ AMOLED 2X కవర్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ కూడా 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే, ఇది FHD+ రిజల్యూషన్ మాత్రమే కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ తో వచ్చింది. ఇది హై ఎండ్ గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్‌ ను సైతం అలవోకగా నిర్వహిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో గరిష్టంగా 16GB ర్యామ్ మరియు 1TB వరకు స్టోరేజ్ ఆఫర్ చేస్తోంది . ఈ కొత్త ఫోల్డ్ ఫోన్ One UI 9 సాఫ్ట్ వేర్ తో Android 17 OS తో లాంచ్ అయ్యింది. ఇది లేటెస్ట్ గెలాక్సీ AI ఫీచర్లు, Gemini Live, ఫోటో అసిస్ట్ వంటి స్మార్ట్ టూల్స్ తో వస్తుంది.

Samsung Galaxy Z Fold 8 Ultra

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ గొప్ప కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ సెటప్ లో 200MP వైడ్ యాంగిల్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఈ కెమెరా 8K మరియు 4K HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, అనేకమైన లేటెస్ట్ AI ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన శాంసంగ్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 10MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

శాంసంగ్ ఈ ఫోన్ ను 5,000mAh డ్యూయల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అలాగే, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 20W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు వైర్లెస్ పవర్ షేర్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో IP48 రేటింగ్, Wi-Fi 7, Samsung Knox సెక్యూరిటీ, మరియు అధునాతన మల్టీ విండో వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: Talliki Vandanam: ఆధార్ నెంబర్ తో డబ్బులు వచ్చేది లేనిది ఆన్‌లైన్ లో చెక్ చేసుకోండి.!

Samsung Galaxy Z Fold 8 Ultra: ప్రైస్

ఈ ఫోన్ ప్రీమియం ధరలో మరియు మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ అందించాము.

  • శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 అల్ట్రా (12GB + 256GB) ప్రైస్ : రూ. 1,99,999
  • శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 అల్ట్రా (12GB + 512GB) ప్రైస్ : రూ. 2,19,999
  • శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 8 అల్ట్రా (16GB + 1TB) ప్రైస్ : రూ. 2,59,999

ఈ ఫోన్ ను గ్రాఫైట్, క్రీమ్, వయొలెట్ షాడో మరియు ప్రత్యేకమైన గ్రీన్ షాడో రంగుల్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ ను కూడా ఈరోజు నుంచి ప్రారంభించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile