శామ్సంగ్ యొక్క తన గెలాక్సీ S8, S8 ప్లస్ ధర లో తగ్గింపు….!!!

శామ్సంగ్ యొక్క తన గెలాక్సీ S8, S8 ప్లస్ ధర లో తగ్గింపు….!!!
HIGHLIGHTS

గెలాక్సీ నోట్ 8 అమెజాన్ లో 1.5 మిలియన్ రిజిస్ట్రేషన్లను పొందింది.

శాంసంగ్ తన ఫ్లాగ్షిప్ డివైసెస్  S8  మరియు  S8  స్మార్ట్ ఫోన్స్ ధరలో   నవరాత్రి కి ముందుగానే  4,000  రూపాయలు కట్ చేయటం జరిగింది . హెచ్డిఎఫ్సి బ్యాంక్ వినియోగదారులు ఈ  డివైస్  కొనుగోలు  చేస్తే  రూ .4,000  ల క్యాష్  బ్యాక్ ను పొందుతారు.

హెచ్డిఎఫ్సి కార్డు హోల్డర్లు  గెలాక్సీ ఎస్ 8 ప్లస్ (128 జీబి  వేరియంట్ )  ఫై 4,000 వేల రూపాయలు  క్యాష్  బ్యాక్ తో పాటుగా 1,000 రూపాయలు  అదనంగా   డిస్కౌంట్ పొందవచ్చును . ఇటీవలే విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8  ఏకంగా  2.5 లక్షల ప్రజల నుంచి  రిజిస్ట్రేషన్ పొందింది.  మరియు గెలాక్సీ  నోట్  8 అమెజాన్ లో  1.5 మిలియన్ రిజిస్ట్రేషన్లను పొందింది. 

శామ్సంగ్ ఇండియా వెబ్సైట్లో సుమారు 1 లక్షల మంది ప్రజలు నమోదు చేసుకున్నారు.అమెజాన్ ఈ సోమవారం నోట్ 8 యొక్క ప్రీ ఆర్డర్స్ మరొకసారి  స్టార్ట్ చేసింది . ఇది సెప్టెంబర్ 21 నుండి సరఫరా చేయబడుతుంది.మార్కెట్ రీసెర్చ్ సంస్థ జిఎఫ్ కె  ప్రకారం, స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో 43 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ ఇండియాలో  టాప్ లో  ఉంది.

గాలక్సీ  S8, గాలక్సీ  S8  ప్లస్ లానే నోట్ 8  లో కూడా  'ఇన్ఫినిటీ డిస్ప్లే '  కలదు  దీని ఎస్పెక్ట్ రేషియో  18.5:9 .దీనిలో 6.3 ఇంచెస్ సూపర్ అమోల్డ్ స్క్రీన్ ఉంది. ఇది డ్యూయల్  కెమెరా సెటప్తో శామ్సంగ్ యొక్క  మొదటి స్మార్ట్ఫోన్. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ తో ఉంటుంది

Digit.in
Logo
Digit.in
Logo