శామ్సంగ్ ఇండియా సోమవారం గత ఏడాది గెలాక్సీ ఎస్ 8 రెడ్ కలర్ వేరియంట్ ను విడుదల చేసింది. దీని ధర రూ. 49,990.
ఈ పరికరం ఏప్రిల్ 13 నుండి అమ్మకం కోసం అందుబాటులో ఉంటుంది మరియు రిటైల్ స్టోర్స్ నుండి కొనుగోలుచేస్తే ఇది 10,000 రూపాయల పే టీఎం క్యాష్ బ్యాక్ ఇవ్వబడుతుంది.
ఇది ఒక డ్యూయల్ ఎడ్జ్ 'ఇన్ఫినిటీ డిస్ప్లే', 12 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, ఇది మల్టీ ఫ్రేమ్ ప్రాసెసింగ్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిజేషన్ (OIS) లక్షణాలు కలిగివున్న ఒక వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ స్మార్ట్ఫోన్.
ఈ పరికరానికి 8 మెగాపిక్సెల్ ఆటో-ఫోకస్ (AF) ఫ్రంట్ కెమెరా మరియు 12 మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ కెమెరా ఉన్నాయి.. గెలాక్సీ S8 మిడ్నైట్ బ్లాక్, మేపల్ గోల్డ్ మరియు ఆర్కిడ్ గ్రే కలర్స్ లో కూడా అందుబాటులో ఉంది.