SAMSUNG Galaxy S25 Edge 5G launched as slimmest phone ever
SAMSUNG Galaxy S25 Edge 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ కేవలం 5.8mm మందంతో అతి సన్నని ఫోన్ గా చరిత్ర సృష్టించింది. ఈ ఫోన్ ను ప్రపంచ మార్కెట్ తో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా శామ్ సంగ్ విడుదల చేసింది. ఈరోజే సరికొత్తగా విడుదలైన ఈ లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.
శామ్సంగ్ ఈ ఫోన్ ను ప్రపంచపు మొట్టమొదటి 5.3mm స్లీక్ ఫోన్ గా విడుదల చేసింది. శామ్సంగ్ యొక్క ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Elite చిప్ సెట్ తో అందించింది. ఇది గరిష్టంగా 4.47GHz క్లాక్ స్పీడ్ అందించే 3nm చిప్ సెట్. ఈ చిప్ సెట్ కి జతగా 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం టైటానియం బిల్ట్ స్లీక్ డిజైన్ కలిగి ఉండటమే కాకుండా టైటానియం సిల్వర్ మరియు టైటానియం జెట్ బ్లాక్ రెండు ప్రీమియం కలర్స్ లో లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ Quad HD+ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సపోర్ట్ ను కూడా అందించింది.
కెమెరా పరంగా, ఈ గెలాక్సీ S25 ఎడ్జ్ లో డ్యూయల్ డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 200MP మెయిన్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ రెండవ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 30fps తో UHD 8K (7680 x 4320) వీడియో రికార్డింగ్ మరియు 120fps తో 4K UHD వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 12MP సెల్ఫీ కెమెరా మరియు టన్నుల కొద్దీ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 3900 mAh బ్యాటరీ తో వస్తుంది. ఈ ఫోన్ లో 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. యూజర్ డేటా ప్రొటక్షన్ కోసం ఈ ఫోన్ లో లేటెస్ట్ Knox Vault ను కూడా అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ One UI 7 పై ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది. అంతేకాదు, 31 May 2032 వరకు రెగ్యులర్ అప్డేట్స్ మరియు మేజర్ అప్డేట్స్ కూడా అందుతుంది.
Also Read: Motorola Razr 60 Ultra: పవర్ ఫుల్ ఫీచర్స్ తో విడుదలైన మోటో ఫ్లిప్ ఫోన్.!
శామ్సంగ్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఇందులో 12GB + 256GB వేరియంట్ ను రూ. 1,09,999 ధరతో మరియు 12GB + 512GB వేరియంట్ ను రూ. 1,21,999 ధరతో అందించింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి Pre-Orders కి అందుబాటులోకి వచ్చింది.