Samsung Galaxy S25 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు శామ్సంగ్ విడుదల చేసింది. గెలాక్సీ ఎస్25 సిరీస్ లో ఈ ఫోన్ బేసిక్ ఫోన్ అవుతుంది మరియు ప్రైస్ పరంగా కూడా ఈ సిరీస్ లో తక్కువ రేటులో ఉంటుంది. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ పరంగా ఆకట్టుకునే స్పెక్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 స్మార్ట్ ఫోన్ 6.2 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ సూపర్ స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు విజన్ బూస్టర్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7.2mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ ను శామ్ చిప్ సెట్ తో లాంచ్ చేసింది. దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 12MP అల్ట్రా వైడ్, 50 MP వైడ్ మరియు 10MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 12MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా AI ఫీచర్స్, 30fps / 60 fps 4K వీడియో రికార్డింగ్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ తో వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో శామ్సంగ్ యొక్క లేటెస్ట్ One UI 7 సాఫ్ట్ వేర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ లో 4000 mAh బిగ్ బ్యాటరీ వుంది మరియు ఇది 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 స్మార్ట్ ఫోన్ ను US మార్కెట్ లో $799 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్ ధర వివరాలు ఈ క్రింద చూడవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ S25 (12GB + 256GB) ధర : రూ. 80,999
శామ్సంగ్ గెలాక్సీ S25 (12GB + 512GB) ధర : రూ. 92,999
ఈ ఫోన్ Pre-Book ఈ రోజు నుంచి మొదలయ్యింది. ఈ ఫోన్ ను అమెజాన్ మరియు Samsung అధికారిక వెబ్సైట్ ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.