samsung galaxy s24 ultra 5g discount
Samsung Galaxy S24 Ultra 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఎన్నడూ చూడనంత తక్కువ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం ఇండియన్ మార్కెట్లో భారీ ఫీచర్స్ మరియు ప్రీమియం బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ 77 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 1,29,999 రూపాయల లాంచ్ ప్రైస్ తో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు కార్ట్ భారీ రూ. 45,041 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 84,958 రూపాయల డిస్కౌంట్ ధరకు సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఆప్షన్ తో 12 నెలల EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 7,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 77,458 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. అంటే, ఈరోజు శామ్సంగ్ పవర్ ఫుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఎన్నడూ చూడనంత తక్కువ ధరలో అందుకునే అవకాశం ఉంది.
Also Read: Vivo Y400 Pro 5G: సెగ్మెంట్ లో అతి సన్నని 3D కర్వుడ్ డిస్ప్లే ఫోన్ గా ఎంట్రీ ఇచ్చింది.!
ఈ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ పరిమాణం కలిగిన Edge AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు QHD+ రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ టైటానియం ఫ్రేమ్ మరియు గొరిల్లా ఆర్మర్ గ్లాస్ తో చాలా కఠినమైన బిల్డ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12 GB ర్యామ్ మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 14 OS తో OneUI సాఫ్ట్ వేర్ పై నడుస్తుంది మరియు ఫోన్ వచ్చిన వెంటనే ఆండ్రాయిడ్ 15 అప్డేట్ అందుకుంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ సూపర్ ప్రీమియం కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 200MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్, 12MP అల్ట్రా వైడ్, 10MP టెలీ ఫోటో కెమెరా కలిగిన రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ UHD 8K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ S-Pen సపోర్ట్ తో కూడా వస్తుంది.