శామ్సంగ్ లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన 5G స్మార్ట్ ఫోన్ గెలాక్సీ M53 5G భారీ అఫర్ తో మొదటిసారిగా అమ్మకానికి రానుంది. ఏప్రిల్ 29 న మొదటిసారిగా అమ్మకానికి వస్తున్నఈ స్మార్ట్ ఫోన్ పైన రూ.2,500 రూపాయల భారీ బ్యాంక్ అఫర్ శామ్సంగ్ అందించింది. ఈ Samsung Galaxy M53 5G వేగవంతమైన 5G ప్రాసెసర్, 108 MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు సేల్ ఆఫర్లను గురించి క్రింద చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy M53 5G: ధర మరియు ఆఫర్లు
Samsung Galaxy M53 5G యొక్క బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.23,999 మరియు మరొక వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.25,999. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 29 న ప్రారంభమవుతుంది. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, క్రెడిట్ కార్డ్స్ మరియు EMI లావాదేవీలపై రూ.2500 తక్షణ తగ్గింపుతో ICICI బ్యాంక్ సమ్మర్ బొనాంజా ఆఫర్ దీనిపైన అందించింది.
శామ్సంగ్ గెలాక్సీ M53 5G స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-0 కటౌట్ కలిగిన 6.7- ఇంచ్ Super AMOELD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 900 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది.
ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-0 కటౌట్ లో కలిగివుంటుంది. అలాగే, 108MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. అలాగే, 2 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్ లను కూడా ఈ ఫోన్ ద్వారా పొందుతారు.