Samsung Galaxy M47 5G complete features and expected price know ahead of launch
శాంసంగ్ ఇండియన్ మార్కెట్లో రేపు విడుదల చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M47 5G ఫోన్ పూర్తి ఫీచర్స్ ఈరోజే తెలుసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్ మరింత ఆకర్షణమైన స్లీక్ డిజైన్ మరియు గొప్ప పర్ఫామెన్స్ అందించే కొత్త చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. మరి Samsung Galaxy M47 5G ఫోన్ పూర్తి ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఈ రోజే తెలుసుకుందామా.
శాంసంగ్ గెలాక్సీ ఎం 47 స్మార్ట్ ఫోన్ 4x స్క్రాచ్ రెసిస్టెంట్ కలిగిన స్ట్రాంగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ స్క్రీన్ ప్రొటెక్షన్ కలిగిన 6.7 ఇంచ్ బిగ్ సూపర్ AMOLED డిస్ప్లే తో లాంచ్ అవుతుంది. ఈ స్క్రీన్ గొప్ప బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ విజువల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 2 మీటర్ డ్రాప్ ను కూడా తట్టుకుని నిలబడే దృఢమైన డిజైన్ ఉందని శాంసంగ్ తెలిపింది.
ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మంచి పెర్ఫార్మన్స్ అందించడానికి వీలుగా ఈ ఫోన్ Snapdragon 6 Gen 3 చిప్ సెట్ జతగా LPDDR5X ర్యామ్ కూడా కలిగి ఉంటుంది. ఇది మల్టీ టాస్కింగ్ మరియు గేమింగ్ కోసం కూడా తగిన విధంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ అప్ కమింగ్ ఫోన్ 50MP OIS ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఫోన్ ముందు భాగంలో 12MP HDR సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో వచ్చిన OnePlus Nord Buds 4 సేల్ ఈరోజు నుంచి ప్రారంభం.!
శాంసంగ్ గెలాక్సీ ఎం 47 స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను రోగ్ రెడ్ మరియు బ్లేజ్ బ్లూ రెండు సరికొత్త రంగుల్లో ప్రవేశపెడుతున్నట్లు శాంసంగ్ తెలిపింది.
ఈ శాంసంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రూ. 24,999 నుంచి రూ. 27,999 రూపాయల ప్రైస్ రేంజ్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి. ఈ ఫోన్ లాంచ్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ అంచనా ప్రైస్ ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.