శామ్సంగ్ గెలాక్సీ M40 vs వివో Z1 ప్రో

శామ్సంగ్ గెలాక్సీ M40 vs వివో Z1 ప్రో
HIGHLIGHTS

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్లను సరిపోల్చి వివరాలను తెలుసుకుందాము.

శామ్సంగ్ తన గెలాక్సీ M సిరిస్ నుండి తీసుకొచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లయినటువంటి, గెలాక్సీ M40 మరియు వివో కొత్తగా ఇండియాలో లాంచ్ చేసినటువంటి వివో Z1 ప్రో రెండు కూడా దాదాపుగా ఒకే విధమైన ప్రత్యేకతలతో వస్తాయి. అయితే, ఈ రెండింటి ధరలలో మాత్రం పెద్ద తేడా కనిపిస్తుంది. కాబట్టి,  ఈ ధరలో ఎక్కువ లాభాలను తీసుకొచ్చే స్మార్ట్ ఫోన్ ఏది? అని తెలుసుకోవడానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్లను సరిపోల్చి వివరాలను తెలుసుకుందాము.       

డిస్ప్లే 

శామ్సంగ్ గెలాక్సీ M40 విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల ఇన్ఫినిటీ – O డిస్ప్లేతో అందించబడుతుంది. ఇది కూడా ఇది ఒక 91.6 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది. ,మరొకవైపు వివో నుండి వచ్చిన ఈ Z1ప్రో , ఒక  6.53 అంగుళాల ఫుల్ HD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేతో ఉంటుంది. సంస్థ ప్రకారంగా, ఇది ఒక 90.77 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది. 

ప్రాసెసర్

 గెలాక్సీ M 40 ఒక స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది మరియు రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ ప్రొసెసరు ట్రిపుల్ రియర్ కెమేరాకు చక్కగా అనుకూలిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 ఫై  పైన ఆధారితంగా సరికొత్త శామ్సంగ్ one UI  పైన నడుస్తుంది.  అయితే, వివో Z1 ప్రో మాత్రం సరికొత్త స్నాప్ డ్రాగన్ 712 AIE ఆక్టా కోర్ 10nm ప్రాసెసర్ తో వస్తుంది.  ఇందులో స్పీడ్ అందించడానికి కావాల్సిన అన్ని టర్బో స్పీడ్ టెక్నాలజీని చాల విభాగాలకు అందించారు.    

బ్యాటరీ మరియు కలర్ ఎంపికలు 

గెలాక్సీ M40 స్మార్ట్ ఫోన్ ఒక  3500 mAh బ్యాటరీ మరియు వేగవంతమైన ఛార్జింగ్ స్పోర్టుగల ఒక టైప్-C చార్జరుతో వస్తుంది. ఈ ఫోన్ మిడ్ నైట్  బ్లూ మరియు  సి వాటర్ బ్లూ వంటి రెండు కలర్ల ఎంపికతో లభిస్తుంది. ఇక వివో Z1 ప్రో విషయానికి వస్తే, ఒక 18W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక పెద్ద 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్, సోనిక్ బ్లాక్, మిర్రర్ బ్లాక్ మరియు సోనిక్ బ్లూ వంటి మూడు కలర్ల ఎంపికతో లభిస్తుంది.

ర్యామ్ వేరియంట్స్

వివో Z1 ప్రో, 4GB/ 64GB స్టోరేజి మరియు 6GB/64GB స్టోరేజి మరియు 6GB/128GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. అయితే, గెలాక్సీ M40 మాత్రం కేవలం 6GB ర్యామ్ జతగా 128GB  వేరియంటుతో మాత్రమే వస్తుంది. అలాగే, గెలాక్సీ M40 ఒక SD కార్డు ద్వారా 512GB వరకూ స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తాయి.        

కెమేరా

వివో Z1 ప్రో  మరియు గెలాక్సీ M 40 రెండు స్మార్ట్ ఫోన్లు కూడా వేనుక భాగంలో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటాయి. వివో Z1 ప్రో యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా, ఒక 8MP సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్ జతగా 16MP ప్రధాన కెమరాతో జతగా మరొక 2MP డెప్త్  కెమేరాని కలిగి ఉంటుంది. ఈ కెమేరా, AI ఇంటెలిజెంట్ ని ఉపయోగించి, మంచి బొకే నైట్ మోడ్ ఫోటోలను తీసుకునేలా చేస్తుంది. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరాతో మంచి ఫోటోలను తీసుకునేలా ఉంటుంది.

ఇక M40 కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 32MP +5MP+8MP  ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 32MP ప్రధాన కెమరా ఒక f/1.7 అపర్చరుతో  ఉంటుంది. ఇంకా 5MP కెమేరా Live ఫోకస్ కోసం మరియు 8MP కెమేరా అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. అలాగే, ఇందులో అందించిన వెనుక కెమెరాతో సూపర్ స్లొమాషన్ వీడియోలను, అదీకూడా 240fps వద్ద తీసుకోవచ్చు. . ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది.

ప్రస్తుత ధరలు

VIVO Z1 PRO ధరలు

1. వివో Z1 ప్రో ( 4GB ర్యామ్ + 64 స్టోరేజి ) – Rs.14,990

2. వివో Z1 ప్రో ( 6GB ర్యామ్ + 64 స్టోరేజి ) – Rs.16,990

3. వివో Z1 ప్రో ( 6GB ర్యామ్ + 128 స్టోరేజి ) – Rs.17,990

Galaxy M40 ధర

శామ్సంగ్ గెలాక్సీ M40 ( 6GB ర్యామ్ + 128 స్టోరేజి ) – Rs. 19,990

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo