32MP +5MP+8MP మరియు పంచ్ హోల్ కెమేరాగల శామ్సంగ్ గెలాక్సీ M40 మొదటి సేల్
శామ్సంగ్ తన M సిరీస్ నుండి మార్కెట్లోకి గొప్ప స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ఇప్పుడు తాజాగా ఈ గెలాక్సీ M సిరీస్ నుండి విడుదల చేసినటువంటి ఈ M40 స్మార్ట్ ఫోన్, ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును మాత్రమేకాకుండా , ఇన్ఫినిటీ O అమోలెడ్ డిస్ప్లే, 3500mAh భారీ బ్యాటరీ మరియు స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలతో అత్యంత సరసమైన ధరలో లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ మరియు samsung.com నుండి జరగనుంది.
ప్రస్తుతం, శామ్సంగ్ తన M సిరీస్ నుండి మార్కెట్లోకి గొప్ప స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. బడ్జెట్ ధర నుండి మొదలుకొని మిడ్ రేంజ్ మరియు సెమీ ప్రీమియం వరకు చాలా గొప్ప ఫోన్లను ఈ M సిరీస్ ద్వారా అందించింది. ఇప్పుడు తాజాగా ఈ గెలాక్సీ M సిరీస్ నుండి విడుదల చేసినటువంటి ఈ M40 స్మార్ట్ ఫోన్, ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును మాత్రమేకాకుండా , ఇన్ఫినిటీ O అమోలెడ్ డిస్ప్లే, 3500mAh భారీ బ్యాటరీ మరియు స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలతో అత్యంత సరసమైన ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ మరియు samsung.com నుండి జరగనుంది.
శామ్సంగ్ గెలాక్సీ M40 ధర
శామ్సంగ్ గెలాక్సీ M40 – 6GB + 128GB – Rs.19,990
శామ్సంగ్ గెలాక్సీ M40 ప్రత్యేకతలు
శామ్సంగ్ గెలాక్సీ M40 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల ఇన్ఫినిటీ – O డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది. ఈ ప్రొసెసరు ట్రిపుల్ రియర్ కెమేరాకు చక్కగా అనుకూలిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 ఫై పైన ఆధారితంగా సరికొత్త శామ్సంగ్ one UI పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3500 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, ఇది 6GB ర్యామ్ జతగా 128GB వేరియంటుతో మాత్రమే వస్తుంది. అలాగే, SD కార్డు ద్వారా 512GB వరకూ స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.
ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 32MP +5MP+8MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 32MP ప్రధాన కెమరా ఒక f/1.7 అపర్చరుతో ఉంటుంది. ఇంకా 5MP కెమేరా Live ఫోకస్ కోసం మరియు 8MP కెమేరా అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అందించిన వెనుక కెమెరాతో సూపర్ స్లొమాషన్ వీడియోలను, అదీకూడా 240fps వద్ద తీసుకోవచ్చు. ఈ ఫోన్ బాక్స్ లో మీకు ఒక టైప్ -C ఇయర్ ఫోన్ కూడా లభిస్తుంది.