Samsung Galaxy M32 5G: విడుదలకు ముందే ఫీచర్ల వెల్లడి…ఎలా ఉన్నాయంటే..!

HIGHLIGHTS

శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి లాంచ్ డేట్ ఫిక్స్

ఆగష్టు 25 న లాంచ్ చేయనున్నట్లు ధ్రువీకరణ

ఈ శాంసంగ్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC

Samsung Galaxy M32 5G: విడుదలకు ముందే ఫీచర్ల వెల్లడి…ఎలా ఉన్నాయంటే..!

Samsung యొక్క బడ్జెట్ సిరీస్ గా గుర్తింపు పొందిన గెలాక్సీ M సిరీస్ నుండి శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ఆగష్టు 25 న లాంచ్ చేయనున్నట్లు ధ్రువీకరించింది. అంతేకాదు, ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజ్ ను కూడా అందించింది. అయితే, విడుదలకు ముందే ఈ ఫోన్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్లను టీజర్ ద్వారా వెల్లడించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M32 5G: స్పెసిఫికేషన్‌లు

స్పీడ్, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ కోసం ఈ శాంసంగ్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ను ఉపయోగించినట్లు శాంసంగ్ టీజేచేస్తోంది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.2 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 GPU తో జతగా ఉంటుంది. ఇది మంచి గేమింగ్ మరియు 12 బ్యాండ్స్ వరకూ 5G సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 2 సంవత్సరాల వరకూ OS సపోర్ట్ తో వస్తుందని కూడా శాంసంగ్ టీజర్ నుండి వెల్లడించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జి స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో కనిపిస్తోంది. ఈ సెటప్ లో 48ఎంపి ప్రధాన కెమెరా ని అందించింది మరియు ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 13ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. అలాగే, 6.49 ఇంచ్ ఇన్ఫినిటీ V-డిస్ప్లేతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీతో లాంచ్ కాబోతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo