శామ్సంగ్ నుండి మరొక బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది.!
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వస్తోంది
Galaxy M సిరీస్ నుండి విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది
కీలకమైన ఫీచర్లతో పాటుగా ధర వివరాల పైన ఒక హింట్ ఇచ్చింది
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శామ్సంగ్ నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఈసారి శామ్సంగ్ తన Galaxy M సిరీస్ నుండి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఆశ్చర్యకరంగా, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లతో పాటుగా ధర వివరాల పైన ఒక హింట్ ఇచ్చింది. ఈ అన్ని వివరాలను పరిశీలిస్తే, Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ను 15 వేల రూపాయల సబ్ కేటగిరిలో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయనున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్ 17న ఇండియాలో విడుదల చేయనున్న ఈ ఫోన్ యొక్క టీజ్డ్ స్పెక్స్ మరియు అంచనా ధర వంటి వివరాలను గురించి తెలుసుకుందాం.
SurveySamsung Galaxy M14 5G: టీజ్డ్ స్పెక్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎం14 6G స్మార్ట్ ఫోన్ చాలా సింపుల్ డిజైన్ లో కనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక మూడు కెమేరాల సెటప్ ను కలిగివుంది. ఈ సెటప్ లో 50MP ప్రధాన కెమేరా ఉన్నట్లు కంపెనీ టీజర్ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ 13MP సెల్ఫీ కెమేరాతో రాబోతున్నట్లు కూడా తెలిపింది. ఈ కెమేరాలతో తక్కువ కాంతిలో కూడా మంచి ఫోటోలు తీయ్యగలదని కూడా హింట్ ఇచ్చింది.
ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి ఎటువంటి హింట్ ఇవ్వలేదు, కానీ ఈ ఫోన్ ఇన్ఫినిటీ V నోచ్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ ని లేటెస్ట్ Exynos1330 5G ప్రోసెసర్ తో తీసుకువస్తునట్లు కూడా శామ్సంగ్ టీజింగ్ వివరించింది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ భారీ 6000 mAh పవర్ ఫుల్ బ్యాటరీని 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
Samsung Galaxy M14 5G: అంచనా ధర
అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ నుండి చేస్తున్న టీజింగ్ ద్వారా ఈ ఫోన్ యొక్క అంచనా ధరను కూడా శామ్సంగ్ హింట్ ఇచ్చింది. ఈ ఫోన్ ధర గురించి టీజింగ్ నుండి రూ.13XXX ధరతో లాంచ్ చేయబోతున్నట్లు చెబుతోంది. అంటే, ఈ ఫోన్ ఉప 14 వేల రూపాయల ధరలో లాంచ్ చేస్తుందని ఖాయం చేసి చెప్పింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
