శామ్సంగ్ గెలాక్సీ M10 పైన భారీ డిస్కౌంట్ : మరింత పోటీ పెంచిన శామ్సంగ్

HIGHLIGHTS

ఇప్పుడు కేవలం Rs. 6,990 ధరతో లభిస్తోంది.

అమేజాన్ ఇండియా నుండి ఈ ధరతో కొనుగోలు చేయవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ M10 పైన భారీ డిస్కౌంట్ : మరింత పోటీ పెంచిన శామ్సంగ్

శామ్సంగ్ నుండి బడ్జెట్ ప్రియులకు మంచి మన్నికైన స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చేటటువంటి గెలాక్సీ M సిరీస్ నుండి మొదటగా వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్ అయిన, శామ్సంగ్ గెలాక్సీ M 10 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ముందెన్నడూ లేనంత తక్కువ ధరకే లభిస్తోంది. ముందుగా,  రూ.7,999 ధరతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ పైన 1000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ శామ్సంగ్ గెలాక్సీ M 10 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం Rs. 6,990 ధరతో లభిస్తోంది. అమేజాన్ ఇండియా నుండి ఈ ధరతో కొనుగోలు చేయవచ్చు.           

Digit.in Survey
✅ Thank you for completing the survey!

శామ్సంగ్ గెలాక్సీ M10 స్పెసిఫికేషన్స్

1.శామ్సంగ్ గెలాక్సీ M10 ( 2GB + 16GB వేరియంట్) ధర – Rs. 6,990

ఈ గెలాక్సీ M10, 19:9 యాస్పెక్ట్ రేషియో గల ఒక 6.22- అంగుళాల HD+ ఇన్ఫినిటీ – V  డిస్ప్లేతో వస్తుంది. ఈ ఇన్ఫినిటీ – V డిస్ప్లే అనేది డిస్ప్లే పైభాగంలో V-ఆకారంలో వుండే,  ఒక  వాటర్ డ్రాప్ నోచ్ వలెనే కనిపిస్తుంది. ఇది 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. ఇది 1.6GHz వద్ద క్లాక్ చేయబడిన Exynos 7870 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఈ ఫోన్, 2GB + 16GB స్టోరేజి మరియు 3GB + 32GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు దీని  స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగి ఉంటుంది.. ఇది డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.9 అపర్చరు గల ఒక 13MP సెన్సారుకు జతగా 120 డిగ్రీల 5MP అల్ట్రా – వైడ్ యాంగిల్ సెన్సరుతో అనుసంధానించిన డ్యూయల్ కెమేరా సేటప్పుతో  వస్తుంది. ముందు, f/2.0 అపర్చరు గల ఒక 5MP కెమేరాతో వస్తుంది మరియు ముందు ఇన్ డిస్ప్లే ఫ్లాష్ తో వస్తుంది. ఇందులో,  3400mAh బ్యాటరీని అందిచారు మరియు ఇది పేస్ అన్లాక్  ఫీచరుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,శామ్సంగ్ v9.5 ఆధారితంగా    ఆండ్రాయిడ్ 8.1.0 OS పైన నడుస్తుంది. ఇది ఓషియన్ బ్లూ మరియు చార్ కోల్ బ్లాక్ వంటి రెండు రంగులలో లభిస్తుంది.       

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo