50MP ట్రిపుల్ కెమెరా 6000 mAh బిగ్ బ్యాటరీతో వచ్చిన శామ్సంగ్ బడ్జెట్ ఫోన్.!

Updated on 22-Jun-2022
HIGHLIGHTS

శామ్సంగ్ ఈరోజు తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

శామ్సంగ్ గెలాక్సీ F13 స్మార్ట్ ఫోన్

000 mAh భారీ బ్యాటరీ తోపాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది

శామ్సంగ్ ఈరోజు తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే శామ్సంగ్ గెలాక్సీ F13 స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో అందించినా కూడా ఫీచర్లు మాత్రం గొప్పగా అందించింది. ఈ ఫోన్ 50 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6000 mAh భారీ బ్యాటరీ తోపాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. శామ్సంగ్ సరికొత్తగా తీసుకువచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ వివరాల పైన ఒక లుక్ వేద్దాం. 

Samsung Galaxy F13: ధర మరియు ఆఫర్లు

శామ్సంగ్ గెలాక్సీ F13 యొక్క 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 మరియు మరొక వేరియంట్  4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ జూన్ 29 న ప్రారంభమవుతుంది. ఇంట్రడక్టరి అఫర్ లో భాగంగా, ICICI బ్యాంక్ క్రెడిట్/డెబిట్  కార్డ్స్ మరియు EMI లావాదేవీలపై రూ.1,000 తగ్గింపును పొందవచ్చు.           

Samsung Galaxy F13: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ F13 స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిటీ-v నోచ్ కలిగిన 6.6- ఇంచ్ LCD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత ప్రాసెసర్ Exynos 850 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6,000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా కలిగివున్నట్లు శామ్సంగ్ తెలిపింది.

ఈ ఫోన్ లో అందించిన కెమెరాల విషయానికి వస్తే, ఇందులో 8MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-v కటౌట్ లో కలిగివుంటుంది. అలాగే, 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ లను కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm జాక్ తో వస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :