Samsung Galaxy F04: బిగ్ బ్యాటరీ, బిగ్ డిస్ప్లేతో వచ్చిన శామ్సంగ్ బడ్జెట్ ఫోన్.!

HIGHLIGHTS

శామ్సంగ్ తన F సిరీస్ నుండి Samsung Galaxy F04 ను విడుదల చేసింది

Galaxy F04 ను 4GB ర్యామ్ మరియు ర్యామ్ ప్లస్ ఫీచర్లతో లాంచ్ చేసింది

ఈ ఫోన్ తో రెండు సంవత్సరాల OS అప్డేట్స్ అఫర్ చేస్తోంది

Samsung Galaxy F04: బిగ్ బ్యాటరీ, బిగ్ డిస్ప్లేతో వచ్చిన శామ్సంగ్ బడ్జెట్ ఫోన్.!

శామ్సంగ్ తన F సిరీస్ నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F04 ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 4GB ర్యామ్ మరియు ర్యామ్ ప్లస్ ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ  వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టబడింది. ఈ లేటెస్ట్ శామ్సంగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను తెలుసుకోండి.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy F04: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగివుంది. ఈ డిస్ప్లే ఇన్ఫినిటీ V- నోచ్ తో వస్తుంది మరియు ఇందులో 5MP సెల్ఫీ కెమెరాని కలిగివుంది.ఈ ఫోన్ మీడియాటెక్ Helio P35 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో మరియు 4GB మరియు 4 ర్యామ్ ప్లస్ తో జతగా వస్తుంది. 

ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 13MP మెయిన్ కెమేరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి.ఈ ఫోన్ 3.5mm జాక్, డ్యూయల్ 4G VoLTE,  WiFi ac మరియు Bluetooth 5.0 ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత One UI  సాఫ్ట్‌వేర్‌ తో పనిచేస్తుంది మరియు రెండు సంవత్సరాల OS అప్డేట్స్ అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 

Samsung Galaxy AF04: ధర

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ ను రూ. 9,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ జనవరి 12 నుండి శామ్సంగ్ స్టోర్ మరియు Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అయితే, లాంచ్ అఫర్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ రూ.7,499 వరకూ లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo