ఇండియాలో విడుదలైన SAMUNG GALAXY A80 స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

ఈ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్స్ ని జూలై 22 నుండి జూలై 31 వ తేదీ వరకూ చేసుకోవచ్చు.

ఇండియాలో విడుదలైన SAMUNG GALAXY A80 స్మార్ట్ ఫోన్

శామ్సంగ్ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్ ముందుగా, ఏప్రిల్ నెలలో థాయిలాండ్ లో ప్రారంభించబడింది, ఈ తాజా స్మార్ట్ఫోన్ ముందుకు మరియు వేనుకకు కూడా రోటేట్  (తిప్పగలిగే) చేయగలిగేలా ఉండే ట్రిపుల్ కెమేరా సేటప్పుతో ఉంటుంది. శామ్సంగ్, దీన్ని నిన్నఇండియాలో రూ.47,990 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ కొత్తగా ప్రకటించిన క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 730G ఆక్టా కోర్ ప్రొసెసరుతో ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్స్ ని జూలై 22 నుండి జూలై 31 వ తేదీ వరకూ చేసుకోవచ్చు. అయితే, ఆగష్టు 1 వ తేదీన దీని మొదటి సేల్ జరగనుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

శామ్సంగ్ గెలాక్సీ A80 ధర :

శామ్సంగ్ గెలాక్సీ A80 (8 GB + 128 GB) – Rs.47,990    

శామ్సంగ్ గెలాక్సీ A80 ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్  20: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎటువంటి నోచ్ లేకుండా ఫుల్ వ్యూ డిస్ప్లే మరియు దాదాపుగా అంచులు లేకుండా, FHD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 1080×2400 p రిజల్యూషను మరియు వీనుల విందైన VIVID మరియు బ్రిట్నెస్ అందిస్తుంది. ఇది తాజాగా క్వాల్కమ్ ప్రకటించినటువంటి, క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 730G  SoC తో నడుస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. అయితే, ఇందులో స్టోరేజిని పెంచుకునేలా ఎటువంటి ఎంపికను అందించలేదు. అలాగే, ఇది ఒక 3,700mAh బ్యాటరీ మరియు 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.         

ఆప్టిక్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ప్రధాన 48MP కెమెరా f / 2.0 ఎపర్చరు జతగా 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూ గల ఒక వైడ్ యాంగిల్ 8MP కెమేరా మరియు ఒక ToF కెమేరాని కలగలిపిన ఒక ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇక్కడ ఆశర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ కెమేరాని ముందు భాగంలో సెల్ఫీగా మరియు వెనుక కెమెరాలగా కూడా వాడుకునేలా రోటేటింగ్ ఎంపికతో అందించింది. అంతేకాదు దిన్ని ఒక  SonyIMX586 సెన్సారుతో అందించింది.  ఇక ఈ 48MP కెమేరా విషయానికి వస్తే, ఇది డిఫాల్ట్ గా రెడ్మి  నోట్ 7 ప్రో మాదిరిగా బిన్నింగ్ పద్దతిలో 12MP రిజల్యూషన్ ఫోటోలను అందిస్తుంది. అయితే, ఈ ఫోనులో అందించిన ఒక ప్రో మోడ్ ద్వారా చాలా వేగంగా 48MP రిజల్యూషన్ ఫోటోలకు మారవచ్చు.  

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile