శామ్సంగ్ గెలాక్సీ A80 అద్భుతమైన ఫిచర్లతో వచ్చింది.

HIGHLIGHTS

ఇప్పుడు గెలాక్సీ A80 స్మార్ట్ ఫోనుతో కొత్త కెమెరా ఫీచరును తీసుకొచ్చింది

ఒక ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది.

క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 730G SoC తో నడుస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ A80 అద్భుతమైన ఫిచర్లతో వచ్చింది.

శామ్సంగ్, ప్రస్తుతం నడుస్తున్న అన్ని ట్రేండింగ్ విభాగాలలో ఎక్కడ వదలకుండా తన స్మార్ట్ ఫోన్లని ప్రవేశపెడుతోంది. వీటన్నిటిని చూస్తుంటే, శామ్సంగ్ తన చేజారిన మొదటి స్థానాన్ని తిరిగి సంపాదించే పనిలో తలమునకలైనట్లు అనిపిస్తోంది. ముందుగా, గెలాక్సీ A సిరీస్ నుండి A10, A30, A50 మరియు A70 వంటి స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చిన శామ్సంగ్ సంస్థ, ఇప్పుడు గెలాక్సీ A80 స్మార్ట్ ఫోనుతో కొత్త కెమెరా ఫీచరును తీసుకొచ్చింది. ముందుకు మరియు వేనుకకు కూడా రోటేట్  (తిప్పగలిగే) చేయగలిగేలా వుండే ఒక ట్రిపుల్ కెమేరా సేటప్పుతో తీసుకువచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

శామ్సంగ్ గెలాక్సీ A80 ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ A80 స్మార్ట్ ఫోన్  20: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎటువంటి నోచ్ లేకుండా ఫుల్ వ్యూ డిస్ప్లే మరియు దాదాపుగా అంచులు లేకుండా, FHD+ రిజల్యూషన్ అందించగల ఒక 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 1080×2400 p రిజల్యూషను మరియు వీనుల విందైన VIVID మరియు బ్రిట్నెస్ అందిస్తుంది. ఇది తాజాగా క్వాల్కమ్ ప్రకటించినటువంటి, క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 730G  SoC తో నడుస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. అయితే, ఇందులో స్టోరేజిని పెంచుకునేలా ఎటువంటి ఎంపికను అందించలేదు. అలాగే, ఇది ఒక 3,700         

ఆప్టిక్స్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ప్రధాన 48MP కెమెరా f / 2.0 ఎపర్చరు జతగా 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూ గల ఒక వైడ్ యాంగిల్ కెమేరా మరియు ఒక ToF కెమేరాని కలగలిపిన ఒక ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇక్కడ ఆశర్యపరిచే విష్యం ఏమిటంటే, ఈ కెమేరాని ముందు భాగంలో సెల్ఫీగా మరియు వెనుక కెమెరాలగా కూడా వాడుకునేలా రోటేటింగ్ ఎంపికతో అందించింది. రివ్యూ యూనిట్లో మాత్రం SonyIMX586 సెన్సారుతో అందించింది. అయితే, ఫోన్ అమ్మకానికి వచ్చే సమయానికి తన సొంత సెన్సారును తీసుకువస్తుందో లేదో అనే విష్యం పైన ఎటువంటి సమాచారం లేదు. ఇక ఈ 48MP కెమేరా విషయానికి వస్తే, ఇది డిఫాల్ట్ గా రెడ్మి  నోట్ 7 ప్రో మాదిరిగా బిన్నింగ్ పద్దతిలో 12MP రిజల్యూషన్ ఫోటోలను అందిస్తుంది. అయితే, ఈ ఫోనులో అందించిన ఒక ప్రో మోడ్ ద్వారా చాలా వేగంగా 48MP రిజల్యూషన్ ఫోటోలకు మారవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo