సూపర్ స్టడీ కెమేరాతో విడుదలైన Samsung Galaxy A51 : ధర, స్పెక్స్ మరియు పూర్తి వివరాలు

Updated on 30-Jan-2020
HIGHLIGHTS

ఈ శామ్సంగ్ గెలాక్సీ A51 లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ ఉంది

శామ్సంగ్ తన సరికొత్త స్మార్ట్ ఫోన్, గెలాక్సీ A51 ని విడుదల చేసింది. ఈ శామ్సంగ్ గెలాక్సీ A51 స్మార్ట్‌ ఫోన్ను ఒక 48MP ప్రధాన కెమేరాతో మరియు మరిన్ని కెమేరా ఫీచర్లతో పాటుగా, మంచి స్పెక్స్ 8GB ర్యామ్ తో తీసుకొచ్చింది. ఈ ఫోన్ కేవలం ఒక్క కెమెరా పరంగా మాత్రమే మరిన్ని గొప్ప ప్రత్యేకతలతో విడుదల చేయ్యబడింది.     

Samsung Galaxy A51 : ధర

గెలాక్సీ A51,  6GB మరియు 8GB RAM ఎంపికలతో వస్తుంది. అయితే, ప్రస్తుతానికి  6GB ర్యామ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంచింది మరియు త్వరలోనే 8GB ర్యామ్ వేరియంట్ ని కూడా ప్రకటించనుంది. ఇక ఈ 6GB +128GB వేరియంట్ ని Rs.23,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్, బ్లూ బ్లాక్ మరియు వైట్ ప్రిజం వంటి మూడు రంగుల ఎంపికలతో వస్తుంది.

ఇక ఈ ఫోనుతో కంపెనీ నేరుగా అందిస్తున్న అఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ తో "One Time Screen Replacement" ఆఫరుతో వస్తుంది.

Samsung Galaxy A51 : ప్రత్యేకతలు       

ఈ శామ్సంగ్ గెలాక్సీ A 51 ఫోనులో ఒక 6.5-అంగుళాల FHD + సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-O డిస్ప్లేతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే లోపల ఒక వేలిముద్ర సెన్సార్ కూడా ఉంచబడింది. ఈ స్మార్ట్‌ ఫోన్, శామ్సంగ్ యొక్క సొంత ప్రాసెసర్ అయినటువంటి Exynos 9611ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు ఇది 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్‌తో జత చేయబడింది. ఈ ఫోన్ యొక్క 8 జిబి ర్యామ్ వేరియంట్ కూడా రానుంది మరియు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్టోరేజిని ఒక మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 512 GB వరకూ పెంచవచ్చు. శామ్సంగ్ గెలాక్సీ A51 OneUI స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 పై తో ఆధారితంగా పనిచేస్తుంది.

కెమెరా గురించి మాట్లాడితే, ఈ శామ్సంగ్ గెలాక్సీ A51 లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో ఒక 48MP ప్రైమరీ కెమెరా ఒక f / 2.0 ఎపర్చరుతో ఉంటుంది.   ఉన్నాయి, రెండవ కెమెరా 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో వస్తుంది. మూడవ కెమెరా 5MP డెప్త్ సెన్సార్ గా పనిచేస్తుంది మరియు మరొక 5MP మ్యాక్రో సెన్సార్ కూడా ఉంటుంది. ఈ కెమెరా సెటప్‌ లో, సూపర్ స్టెడి, సీన్ ఆప్టిమైజర్ మరియు మ్యాక్రో వంటి ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఈ ఫోనులో సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది, దీనిలో ఎపర్చరు ఎఫ్ / 2.2 ఉంది.

మొబైల్ ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు వైట్ రంగులలో ప్రవేశపెట్టబడింది.ఈ  ఫోన్ 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. అయితే, బాక్సులో మాత్రం 15W ఛార్గర్ అందించబడుతుంది . ఈ స్మార్ట్‌ ఫోన్ యొక్క మొదటి సేల్  జనవరి 31 నుండి మొదలవుతుంది. ఈ ఫోన్ను, అన్ని ప్రధాన స్టోర్లు మరియు  e- రిటైలర్ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :