ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ Samsung మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను గత సంవత్సరం అందించిన గెలాక్సీ A03 యొక్క తరువాతి తరం ఫోన్ గా ఈ Samsung Galaxy A04 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ 50MP ప్రధాన కెమెరా, బిగ్ బ్యాటరీ మరియు మరిన్ని ఇతర ఫీచర్లతో వచ్చింది. ఈ లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ఎలాంటి వివరాలతో వచ్చిందో చూద్దాం.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy A04: స్పెక్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎ04 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగివుంది. ఈ డిస్ప్లే ఇన్ఫినిటీ వి- నోచ్ తో వస్తుంది మరియు ఇందులో 5MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఏ ప్రాసెసర్ తో పనిచేస్తుందనే విషయాన్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ లో Exynos 850 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉందవచ్చని ఊహిస్తున్నారు. ఈ ఫోన్ 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది.
ఈ ఫోన్ 3.5mm జాక్, డ్యూయల్-బ్యాండ్ WiFi ac, Bluetooth 5.0 ఫీచర్లతో వస్తుంది. అలాగే, Android 12 ఆధారిత One UI కోర్ 4.1 సాఫ్ట్‌వేర్ తో నడుస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, ఈ ఫోన్ ఎటువంటి ఛార్జింగ్ టెక్ ను తో వస్తుందో మాత్రం కంపెనీ తెలుపలేదు.
Samsung Galaxy A04: ధర
శామ్సంగ్ గెలాక్సీ ఎ04 స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు సేల్ వివరాలను Samsung ఇంకా వెల్లడించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ తెలుపు, నలుపు, ఆకుపచ్చ మరియు రాగి రంగులలో అందుబాటులో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile