Redmi Turbo 5 india launch announced
Redmi Turbo 5: షియోమీ ఇండియాలో విడుదల చేయబోతున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ వివరాలు రివీల్ చేసింది. అదే, రెడ్ మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ కోసం షియోమీ టీజింగ్ కూడా సార్ట్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ చెబుతోంది.
రెడ్ మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను షియోమీ ఇంకా ప్రకటించలేదు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ‘కమింగ్ సూన్’ ట్యాగ్ తో మాత్రమే టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ ని కూడా అందించింది. అంటే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ తో పాటు అమెజాన్ ఇండియా ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
రెడ్ మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క డిజైన్ వివరాలు రివీల్ చేసింది. ఈ టీజర్ పేజీ నుంచి “ ఇక నుంచి ఫాస్ట్ అంటే కేవలం ఒక ఫీచర్ కాదు ఇది డిఫాల్ట్ గా ఉంటుంది’ అని క్యాప్షన్ పెట్టింది. అంటే, ఈ ఫోన్ డిఫాల్ట్ గానే గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ను కూడా కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చాలా డీసెంట్ అండ్ సింపుల్ లుక్ తో ఉన్నట్లు అర్థం అవుతుంది. అయితే, ఈ ఫోన్ ఫీచర్స్ మాత్రం పవర్ ఫుల్ గా ఉండే అవకాశం ఉండొచ్చు. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా తో కనిపిచింది. అంతేకాదు, ఈ కెమెరా చుట్టూ రెడ్ కలర్ లైట్స్ ఉన్నట్లు కనిపిస్తోంది.
Also Read: అమెజాన్ సేల్ నుంచి రూ. 20,000 ధరలో లభిస్తున్న బెస్ట్ 5G Smartphone డీల్స్.!
ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చాలా స్లీక్ గా కాకుండా ఓ మోస్తరు మందంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే, ఈ ఫోన్ లో భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉండొచ్చని ఆశిస్తున్నారు. ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా రివీల్ చేయబోతున్నట్లు షియోమీ తెలిపింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ తో పాటు కొత్త అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.