రెడ్మి నోట్ 7 ప్రో యొక్క ఓపెన్ సేల్ అఫర్ రేపటితో ముగియనుంది

HIGHLIGHTS

ఇప్పుడు REDMI NOTE DAYS సేల్ ద్వారా జూలై 12 వ తేదీ వరకూ ఓపెన్ సేల్ ద్వారా అందిస్తోంది.

రెడ్మి నోట్ 7 ప్రో యొక్క ఓపెన్ సేల్ అఫర్ రేపటితో ముగియనుంది

కేవలం మధ్యస్థ ధరలో ఒక 48MP కెమేరాతో వచ్చినటువంటి ఒకే ఒక్క స్మార్ట్ ఫోనుగా, షావోమి యొక్క రెడీమి నోట్ 7 ప్రో గురించి చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్, ఈ సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోనుగా కూడా నిలచింది. అతివంటి ఈ స్మార్ట్ ఫోన్ను ఇప్పటి వరకు కేవలం ఫ్లాష్ సేల్ ద్వారా మాత్రమే అమ్ముడుచేసిన షావోమి సంస్థ, ఇప్పుడు REDMI NOTE DAYS సేల్ ద్వారా జూలై 12 వ తేదీ వరకూ ఓపెన్ సేల్ ద్వారా అందిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ సేల్ ద్వారా కొనుగోలు చేసేవారు 4GB మరియు 6GB ఎటువంటి కలర్ వేరియంట్ అయినాసరే వారికీ నచ్చిన ఎంపికలతో కాయనుగోలు చేయవచ్చు. అధనంగా,  ఈ సేల్ ద్వారా కొనుగోలు చేసే వారికీ నో కాస్ట్ EMI మరియు తక్కువ EMI చెల్లించే పద్దతిలో కూడా ఎంచుకునేలా అవకాశం అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ను Flipkart మరియు Mi.com నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు.

ఇటీవల POCO F1 స్మార్ట్ ఫోను అందుకున్నటువంటి, గేమ్ టర్బో మోడ్ ని ఇప్పుడు రెడ్మి నోట్ 7 ప్రో కూడా అందుకుంది. దీని ద్వారా CPU మరియు GPU యొక్క పనితీరు మరింత వేగవంతం చేయబడుతుంది. తద్వారా, గేమింగ్ పనితీరు మరింత మెరుగ్గా మారుతుంది. అంటే మీరు ఈ మొబైల్ ఫోన్‌లో అంటే రెడ్‌మి నోట్ 7 ప్రోలో PUBG మొబైల్‌ వంటి హై ఎండ్ గ్రాఫిక్ గేమ్స్ మరింత సున్నితంగా మరియు సునాయాసంగా ఆడవచ్చు.

రెడ్మి నోట్ 7 ప్రో ధరలు

1. రెడ్మి నోట్ 7 ప్రో  – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 13,999

2. రెడ్మి నోట్ 7 ప్రో  – 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 15,999

2. రెడ్మి నోట్ 7 ప్రో  – 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 16,999

రెడ్మి నోట్ 7 ప్రో  ప్రత్యేకతలు   

ఈ రెడ్మి నోట్ 7 ప్రో, డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల డిస్పల్ తోవస్తుంది.  ఒక 450 nits బ్రైట్నెస్ తో కేవలం 0.8mm మందపాటి bezelsను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో కూడా @5వ తారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని అందించారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్,  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 48MP సెన్సారు కలిగి ఉంటుంది. ఈ నోట్ 7 ప్రో యొక్క 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుందిని కంపెనీ పేర్కొంది. ఈ  48MP కెమెరా f/1.79 అపర్చరుతో మరియు 6P లెన్స్ తో అందించబడయింది.  ఈ సెన్సార్ 1/2-అంగుళ పరిమాణాన్నికలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుందిని సంస్థ వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile