Redmi Note 9 Pro Max స్మార్ట్ ఫోన్ ఎన్నడూ లేనంత తక్కువ ధరకే సేల్

Updated on 23-Jan-2021
HIGHLIGHTS

Redmi Note 9 Pro Max స్మార్ట్ ఫోన్ ఎన్నడూ లేనంత తక్కువ ధరకే

ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి 2000 రూపాయల భారీ డిస్కౌంట్

SBI బ్యాంకు క్రెడిట్ కార్డుతో 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్

Redmi Note 9 Pro Max స్మార్ట్ ఫోన్ ఎన్నడూ లేనంత తక్కువ ధరకే సేల్ అవుతోంది. ముందుగా, 16,999 రూపాయల ధరతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్, ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి 2000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ ను SBI బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనేవారికి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ అఫర్ ధర

రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ( 6GB + 64GB ) -Rs.14,999 ( .Buy Here )

రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ స్పెషిఫికేషన్లు

రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్, ఒక 6.67 అంగుళాల పరిమాణంగల డాట్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 2400×1080 పిక్సెళ్ళు అంటే FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,  కొత్త వేగవంతమైన ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 720G SoC శక్తితో పనిచేస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు వేగంగా పనిచేస్తుంది. ఇది 618 GPU తో వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ బాగా అనిపిస్తాయి మరియు గేమింగ్ మరింత ఆహ్లాదంగా ఉంటుంది. రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ 6GB / 8GB వేరియంట్లలో లభిస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ వెనుక  64MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులో 64MP ప్రధాన కెమేరా కాగా, 8MP వైడ్ యాంగిల్, 5MP మరియు 2MP  సెన్సార్లతో జతగా వస్తుంది. ఇక ముందుభాగంలో, రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమేరాని అందించింది. రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ఒక 5020mAh బ్యాటరీని, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ MIUI 11 స్కిన్ పైనఆండ్రాయిడ్ 10 తో విడుదల చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :