48MP+8MP+2MP+2MP కెమేరాతో చాల చౌకధరలో వచ్చిన REDMI NOTE 8 స్మార్ట్ ఫోన్

Updated on 17-Oct-2019
HIGHLIGHTS

షావోమి, ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ అయినటువంటి REDMI NOTE 8 ను మంచి స్పెక్స్ తో చాల తక్కువ ధరలో విడుదల చేసింది లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వేనుక ఒక 48MP ప్రధాన కేమెరా గల క్వాడ్ కెమెరాతో మరియు సరికొత్తగా వచ్చినటువంటి క్వల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 చిప్ సెట్ తో వచ్చింది. ఆయితే, ఈ ఫోన్ను మాత్రం కేవలం రూ.9,999 ధరలో బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఇంకా మరెన్నో విశేషాలతో విడుదలయ్యింది.       

రెడ్మి నోట్ 8 ప్రో  : ధరలు

1. రెడ్మి నోట్ 8 ప్రో (4GB +64GB ) – Rs.9,999/-

2. రెడ్మి నోట్ 8 ప్రో (6B +128GB ) – Rs.12,999/-

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ అక్టోబరు 21 వ తేది మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది.   

రెడ్మి నోట్ 8 ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అదనంగా, ఇందులో 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ తో వచ్చింది. దీనికి జతగా ఒక 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది.  

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  48 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 13MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 లో,ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అంతేకాదు, ఇది 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది.   

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :