Redmi Note 16 Pro sale started with big deals
Redmi Note 16 Pro: షియోమీ లేటెస్ట్ గా విడుదల చేసిన రెడ్‌మి నోట్ 16 ప్రో స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అయ్యింది. ఈ సిరీస్ నుంచి అందించిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయిన నోట్ 16 స్మార్ట్ ఫోన్ ను భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది. 200MP AI కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ ఫోన్ ను రెడ్‌మి అందించింది. ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాము.
రెడ్‌మి ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్టార్టింగ్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 29,999 ధరతో మరియు ఈ ఫోన్ రెండవ (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను రూ. 31,999 ప్రైస్ తో అందించింది. రెడ్‌మి నోట్ 15 ప్రో ఫోన్ కార్బన్ బ్లాక్, సిల్వర్ యాష్ మరియు మిరాజ్ బ్లూ మూడు రంగుల్లో లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా రెడ్‌మి అందించింది. ICICI మరియు HDFC క్రెడిట్ కార్డు EMI ఆప్షన్ పై రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను ఈ ఫోన్ పై రెడ్‌మి అందించింది. ఇదే కాదు ఈ ఫోన్ పై అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా అందించింది.
Also Read: Super Deal: కేవలం రూ. 16,499 రేటుకే ఫ్రేమ్ లెస్ 4K QLED Smart Tv అందుకోండి.!
రెడ్‌మి నోట్ 15 ప్రో 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది మరియు ఇది ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు డాల్బీ విజన్ తో పాటు HDR10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంటే, ఇది గేమింగ్ మరియు కంటెంట్ కోసం కూడా బాగా అనువైన డిస్ప్లే అవుతుంది. ఈ కొత్త ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7400 Ultra (4nm) ప్రొసెసర్ తో రెడ్‌మి అందించింది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ జతగా 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది.
ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో, 200 MP మెయిన్ కెమెరా జతగా 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ఇదే కాదు ఈ ఫోన్ ముందు భాగంలో 20 MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ 30FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో 6580 mAh బిగ్ బ్యాటరీ వుంది మరియు ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ IP66, 68, 69 మరియు 69K రేటింగ్ తో ఇండస్ట్రీ లీడింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ Hi Res ఆడియో మరియు డాల్బీ అట్మాస్ వంటి గొప్ప ప్రీమియం ఆడియో ఫీచర్స్ ను డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ను కూడా కలిగి వుంది.