Redmi Note 15 SE 5G launched with luxury design and long battery
Redmi Note 15 SE 5G: రెడ్ మీ నోట్ 15 సిరీస్ నుంచి స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ నోట్ 15 SE ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను లగ్జరీ డిజైన్ మరియు లాంగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందించింది. ఈరోజే భారత్ లో సరికొత్తగా విడుదలైన ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.
రెడ్ మీ ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్ ధరలు లిస్ట్ ఈ క్రింద చూడవచ్చు.
రెడ్ మీ నోట్ 15 SE 5జి ( 6GB + 128GB) ప్రైస్ : రూ. 19,999
రెడ్ మీ నోట్ 15 SE 5జి ( 8GB + 128GB) ప్రైస్ : రూ. 21,999
రెడ్ మీ నోట్ 15 SE 5జి ( 6GB + 256GB) ప్రైస్ : రూ. 23,999
ఈ స్మార్ట్ ఫోన్ క్రిమ్సన్ రిజర్వ్, ఫ్రొస్టెడ్ వైట్ మరియు కార్బన్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. . ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు షియోమీ సైట్స్ నుంచి లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2000 రూపాయల అదనపు చేంజ్ బోనస్ మరియు రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే అందుకునే ఛాన్స్ ఉంటుంది. HDFC, SBI మరియు ICICI మూడు బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ అదనపు బ్యాంకు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: అత్యంత చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!