Redmi Note 15 Pro Price ఆన్లైన్ లో లీకయ్యింది.. లాంచ్ కంటే ముందే ప్రైస్ తెలుసుకోండి.!

Updated on 28-Jan-2026
HIGHLIGHTS

Redmi Note 15 Pro Price ఈరోజు ఆన్‌లైన్ లో లీకయ్యింది

200MP డ్యూయల్ కెమెరా మరియు 6580 mAh పెద్ద బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తుంది

ఈ ఫోన్ ఇప్పుడు ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉంది

Redmi Note 15 Pro Price ఈరోజు ఆన్‌లైన్ లో లీకయ్యింది. ఈ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుండగా, ఈరోజు ఈ ఫోన్ ప్రైస్ ఆన్‌లైన్ లీకయ్యింది. రెడ్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క లీక్డ్ ప్రైస్ చూస్తుంటే, ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఈ ఫోన్ ను డాల్బీ విజన్ స్క్రీన్, 200MP డ్యూయల్ కెమెరా మరియు 6580 mAh పెద్ద బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తుంది.

Redmi Note 15 Pro Price: లీక్ అయిన ప్రైస్ ఏమిటి?

రెడ్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ మూడు వేరియంట్ లీక్డ్ ప్రైస్ ను ఇప్పుడు చూద్దాం. ఈ ఫోన్ బేసిక్ (8GB + 128GB) వేరియంట్ ను రూ. 30,999 (లీక్ ప్రైస్) ధరతో మరియు (8GB + 256GB) వేరియంట్ ను రూ. 32,999 (లీక్ ప్రైస్) ధరతో లాంచ్ చేసే అవకాశం ఉందని కొత్త లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ ను ఇప్పటికే కంపెనీ స్టార్ట్ చేసింది మరియు ఈ ప్రీ బుకింగ్ నుంచి గొప్ప ఆఫర్స్ కూడా ఈ ఫోన్ పై అందించింది.

పైన తెలిపిన ధరలు రూమర్ అండ్ లీక్డ్ ప్రైస్ గా మాత్రమే మనం చూడాలి. అంతేకాదు, కంపెనీ అఫీషియల్ గా ఈ ఫోన్ ప్రైస్ వెల్లడించే వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉంది మరియు కేవలం రూ. 1,999 చెల్లించి ఈ ఫోన్ ను ప్రీ బుక్ చేసుకోవచ్చు.

Also Read: ఆన్లైన్ లో లీకైన నథింగ్ అప్ కమింగ్ ఫోన్ Nothing Phone 4a Pro వివరాలు.!

Redmi Note 15 Pro : ఫీచర్స్

కంపెనీ ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ ఇప్పటికే విడుదల చేసింది. ఈ ఫోన్ ను గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ కలిగిన 6.83 అంగుళాల AMOLED స్క్రీన్ తో లాంచ్ చేస్తుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 Ultra (4nm) ప్రాసెసర్ తో లాంచ్ అవుతుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి.

ఈ షియోమీ స్మార్ట్ ఫోన్ 200 MP ప్రైమరీ కెమెరా మరియు 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 20 MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6580 mAh పెద్ద బ్యాటరీ వుంది మరియు ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను IP66, 68, 69, మరియు 69K రేటింగ్ తో ఇండస్ట్రీ లీడింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :