REDMI Note 15 5G: స్ట్రాంగ్ బిల్డ్ మరియు సూపర్ డిస్ప్లేతో రిలీజ్ అయ్యింది.!

Updated on 06-Jan-2026
HIGHLIGHTS

రెడ్ మీ నోట్ 15 సిరీస్ నుంచి ఈరోజు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది

REDMI Note 15 5G ను స్ట్రాంగ్ బిల్డ్ మరియు సూపర్ డిస్ప్లేతో రిలీజ్ చేసింది

ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ బడ్జెట్ చిప్ సెట్ Snapdragon 6 Gen 3 తో లాంచ్ చేసింది

REDMI Note 15 5G: రెడ్ మీ నోట్ 15 సిరీస్ నుంచి ఈరోజు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను స్ట్రాంగ్ బిల్డ్ మరియు సూపర్ డిస్ప్లేతో వంటి మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. షియోమీ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్ లుక్కేద్దాం పదండి.

REDMI Note 15 5G: ప్రైస్

రెడ్ మీ నోట్ 16 స్మార్ట్ ఫోన్ రూ. 22,999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ను ఈ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ను రూ. 22,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్ గ్లేసియర్ బ్లూ మరియు మిస్ట్ పర్పల్ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఇక ఈ ఫోన్ అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై వారి డిస్కౌంట్ ఆఫర్లను లాంచ్ ఆఫర్స్ లో భాగంగా షియోమీ అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ పై Axis, SBI Card మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ రూ. 3,000 అదనపు డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 19,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో అందుకోవచ్చు. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ జనవరి 9వ తేదీన ప్రారంభం అవుతుంది.

REDMI Note 15 5G: ఫీచర్స్

ఈ రెడ్ మీ ఫోన్ 1.7m ఎత్తునుంచి క్రింద పడినా కూడా తట్టుకునే స్ట్రాంగ్ బిల్డ్ తో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది MIL STD 810H మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.5mm స్లీక్ డిజైన్ టి ఉంటుంది మరియు చాలా తేలికగా కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను 6.77-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే తో విడుదల చేసింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు TUV ట్రిపుల్ ఐ కేర్ సర్టిఫికేషన్‌ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ బడ్జెట్ చిప్ సెట్ Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ తో లాంచ్ చేసింది. ఇది మంచి పెర్ఫార్మన్స్ తో పాటు బ్యాటరీ ఎఫీషియెన్సీ మరియు మంచి 5G అనుభవం కోసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ Hyper OS 2 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 తో నడుస్తుంది.

Also Read: Oppo A6 Pro 5G: సైలెంట్ గా 7000 mAh బిగ్ బ్యాటరీ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో.!

ఆప్టిక్స్ విభాగంలో, ఈ ఫోన్ లో వెనుక 108 MP మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు మంచి AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5520 mAh బిగ్ బ్యాటరీని 45W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos మరియు Hi-Res ఆడియో సపోర్ట్ కలిగి ఉండటమే కాకుండా బిల్ట్ ఇన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :