Redmi Note 15 5G battery and processor like more features announced
Redmi Note 15 5G : షియోమీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 15 చిప్ సెట్, బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్స్ కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసిన కంపెనీ ఈ ఫోన్ ఫీచర్స్ ఒకొక్కటిగా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ గురించి కంపెనీ అందించిన కొత్త అప్డేట్ ఏమిటో చూద్దామా.
రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ ను చాలా సన్నని స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు వెనుక కూడా ఆకర్షణీయమైన కర్వుడ్ బ్యాక్ డిజైన్ ఉన్నట్లు టీజర్ ఇమేజ్ చూపుతోంది. ఈ రెడ్ మీ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon 6 Gen 3 ప్రోసెసర్ తో లాంచ్ అవుతుంది. ఇది లేటెస్ట్ జనరేషన్ ప్రోసెసర్ మరియు దీని ముందు తరం ప్రోసెసర్ కంటే అధిక వేగంతో ఉంటుంది. అంతేకాదు, ఇది 48 నెలల ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా కంపెనీ నొక్కి చెబుతోంది.
ఈ అప్ కమింగ్ ఫోన్ IP రేటింగ్ ఫీచర్ ను ఈరోజు కంపెనీ రివీల్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ IP 66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా వస్తుంది. ఈ ఫోన్ లో బిగ్ 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన స్లీక్ డిజైన్ లో ఇది బిగ్ బ్యాటరీ అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 108MP మెయిన్ కెమెరా కలిగిన రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.
ఈ ఫోన్ అమెజాన్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ వివరాలు అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లు కూడా త్వరలో వెల్లడిస్తుంది. షియోమీ ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేయకుండానే ఈ ఫోన్ కీలక ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. ఇది పాత స్ట్రాటజీ మరియు ఇప్పుడు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో చేస్తోంది.
Also Read: Flipkart Sale నుంచి కేవలం 21 వేలకే 50 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
ఈ వారం ముగిసే లోపుగా ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ వెల్లడించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఫోన్ లాంచ్ డేట్ డిసెంబర్ ముగిసే లోపుగా ఉండే అవకాశం ఉండవచ్చని కూడా ఊహించి చెబుతున్నారు.