డిస్కౌంట్ అఫర్ తో Redmi Note 12 ఫస్ట్ సేల్ రేపు జరగనున్నది.!
Redmi Note 12 మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది
లాంచ్ అఫర్ లో భాగంగా కంపెనీ గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా జతచేసింది
ఈ స్మార్ట్ ఫోన్ ధర స్పెక్స్ మరియు ఫీచర్లు గురించి తెలుసుకోండి
షియోమి Redmi Note 12 సిరీస్ నుండి లేటెస్ట్ గా విడుదల చేసిన 4G స్మార్ట్ ఫోన్ Redmi Note 12 రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అఫర్ లో భాగంగా కంపెనీ గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా జతచేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రెడ్ మి నోట్ 12 సిరీస్ నుండి వచ్చిన 4G మొబైల్ అయినా కూడా ఆకర్షణీయమైన డిజైన్ మరియు బిగ్ SuperAMOLED డిస్ప్లే వంటి ఫీచర్లతో లాంచ్ చేసినట్లు షియోమి తెలిపింది. రేపు మొదటిసారిగా సేల్ కి రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర స్పెక్స్ మరియు ఫీచర్లు గురించి తెలుసుకోండి.
SurveyRedmi Note 12: ధర
రెడ్ మి నోట్ 12 4G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో రూ.14,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. మరొక వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ధర రూ.16,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు mi స్టోర్ జరగుతుంది.
ఆఫర్స్:
ఈ ఫోన్ పైన గొప్ప లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI తో కొనేవారికి 1,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.
Redmi Note 12 4G: స్పెక్స్
Redmi Note 4G ఫోన్ 6.5-ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన Super AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 685 SoC తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్ 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ లేటెస్ట్ MIUI 14 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 13 OS పైన నడుస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 5MP మెయిన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ Hi-Res ఆడియో సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్ ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
