రెడ్ మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్..!!

HIGHLIGHTS

షియోమీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మి నోట్ 11 SE మొదటి సేల్ రేపు జరగనున్నది

MOLED డిస్ప్లే, 64MP కెమేరాతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G95 SoC తో పనిచేస్తుంది

రెడ్ మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్..!!

షియోమీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మి నోట్ 11 SE మొదటి సేల్ రేపు జరగనున్నది. కేవలం బడ్జెట్ ధరలో బిగ్ ర్యామ్, AMOLED డిస్ప్లే మరియు 64MP కెమేరాతో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పైన గొప్ప లాంచ్ అఫర్ ను కూడా షియోమీ ప్రకటించింది. రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను క్రింద చూడవచ్చు.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 11 SE: ప్రైస్

రెడ్ మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ తో లాంచ్ అయ్యింది మరియు దీని ధర రూ.13,999. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఆగష్టు 31 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart, Mi.com,Mi Home మరియు Mi Studios నుండి జరుగుతుంది. ఈ ఫోన్ పైన ICICI బ్యాంక్ కార్డ్స్ పైన 1000 తగ్గింపు అఫర్ ను కూడా ప్రకటించింది.    

Redmi Note 11T SE : స్పెక్స్

రెడ్ మి నోట్ 11 SE యొక్క స్పెక్స్ విషయానికి వస్తే, ఇది 6.43 ఇంచ్ FHD+ సూపర్ AMOLED డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగివుంది. ఈ 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G95 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ లను అందిస్తుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక క్వాడ్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 64MP మైన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్ లను అందించింది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 13ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

ఇక ఇతర ఫీచర్ల విషయానికివస్తే, ఇది MIUI 12.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు,Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo