Redmi K50i: డాల్బీ విజన్ డిస్ప్లే, 64MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్..!!
ఈరోజు విడుదలైన Redmi K50i 5G
Dolby Vision డిస్ప్లేతో వచ్చింది
ఈ ఫోన్ 67W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,080mAh బ్యాటరీని కలిగి ఉంది
షియోమీ యొక్క K సిరీస్ నుండి కొత్త ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. Redmi K50i 5G పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ అల్రౌండ్ ఫీచర్లతో ఆకట్టుకునే ధరలో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ Dolby Vision డిస్ప్లే మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీని కూడా కలిగి వుంది. అంతేకాదు, మంచి కెమెరా సెటప్ తో పాటుగా వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీని కూడా ఈ ఈ ఫోన్ లో వుంది. మరి ఈ సరికొత్త షియోమీ స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేద్దామా.
SurveyRedmi K50i 5G: ధర
రెడ్ మి కె 50i స్మార్ట్ ఫోన్ యొక్క 6GB ర్యామ్/128GB స్టోరేజ్ కలిగిన బేసిక్ మోడల్ ధర రూ.25,999. అలాగే, 8GB ర్యామ్/256GB స్టోరేజ్ కలిగిన హై ఎండ్ మోడల్ ధర రూ.28,999. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి, అంటే 23 నుండి అమెజాన్ మరియు mi.com నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా షియోమీ ఈ ఫోన్ తో ప్రకటించింది.
Redmi K50i 5G: స్పెక్స్
రెడ్ మి కె 50i స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన లిక్విడ్ FFS డిస్ప్లేని కలిగివుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది HDR 10 మరియు Dolby Vision లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 5nm ప్రాసెసర్ Dimensity 8100 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా LPDDR5 8GB ర్యామ్ మరియు UFS 3.1 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ను అన్ని సమయాల్లో చల్లబరిచేందుకు లిక్విడ్ కూల్ 2.0 ఫీచర్ ను కూడా అందించింది.
ఆప్టిక్స్ పరంగా, K50i 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 64MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు మ్యాక్రో కెమెరా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 67W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,080mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన MIUI 13 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile