ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రెడ్‌మి 9 ఎ స్మార్ట్ ఫోన్ సేల్ మొదలవుతుంది. ఈ సెల్, అమెజాన్ ఇండియా మరియు మి.కామ్ లో జరుగుతుంది. ఈ ఫోన్ ను ఇటీవల భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ చేశారు.ఈ మొబైల్ ఫోన్ లో మీరు 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, మీడియాటెక్ హెలియో జి 25 ప్రాసెసర్ ను అందుకోవచ్చు. ఇది కాకుండా, మీరు ఫోన్ లో స్ప్లాష్ రెసిస్టెంట్ సామర్ధ్యాన్ని కూడా పొందవచ్చు, దీని కోసం ఫోన్ లో P2i పూత చేర్చబడింది.
షియోమి రెడ్‌మి 9 ఎ ధర 2 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ బేస్ వేరియంట్ కోసం రూ .6,799 రూపాయలుగా ప్రకటించగా, 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ కోసం రూ .7,499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
షియోమి రెడ్‌మి 9A ఒక 6.53-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది, సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో ఉంటుంది. Redmi 9A ఫోన్ స్క్రీన్ మీకు అత్యధికంగా 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ మరియు 20: 9 ఎస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. ఇది 9 మిల్లీమీటర్ల మందం మరియు 196 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. రెడ్‌మి 9A మిడ్నైట్ బ్లాక్, సీ బ్లూ మరియు నేచర్ గ్రీన్ అనే మూడు రంగులలో వస్తుంది.
Redmi 9A మీడియా టెక్ హెలియో జి 25 ప్రాసెసర్ యొక్క ఆక్టా-కోర్ సిపియుతో పనిచేస్తుంది మరియు 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్ ఆప్షన్లతో జతచేయబడుతుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు మెమరీ విస్తరణకు మద్దతు ఇస్తుంది. ఇది MIUI 12 అవుట్-ఆఫ్-బాక్స్‌లో నడుస్తుంది.
రెడ్‌మి 9 ఎ లో 13 ఎంపి కెమెరాని ఎఫ్ / 2.2 ఎపర్చరుతో, 5 ఎంపి సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్‌లో ఉన్నాయి. ఇది ప్రాథమిక సెన్సార్లు మరియు కనెక్టివిటీ లక్షణాలతో Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 తో వస్తుంది. షియోమి రెడ్‌మి 9A లో 5,000WAA బ్యాటరీ 10W రెగ్యులర్ ఛార్జింగ్ వేగంతో ఉంటుంది.