ఈరోజే షావోమి రెడ్మి 8A లాంచ్ : తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో రానుంది
ఈ ధరలో యుఎస్‌బి-సి పోర్ట్‌తో వచ్చే మొదటి ఫోన్ ఇదే అవుతుంది.
షావోమి తన రెడ్మి 8 A స్మార్ట్ ఫోన్ను ఈ రోజు భారతదేశంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త రెడ్మి ఫోన్ రెడ్మి 7 A యొక్క అప్డేట్ వెర్షన్ గా రానుంది. షావోమి ఇప్పుడు తన సరికొత్త వ్యూహాలతో ఈ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయబోతోంది. కంపెనీ ఈ ఫోన్ను వాటర్ డ్రాప్ నోచ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ తో అందించబోతోంది. అంతేకాదు, ఒక పెద్ద బ్యాటరీతో కూడా స్మార్ట్‌ఫోన్ను తీసుకువస్తోంది.
Surveyలైవ్ లాంచ్ ఇలా చూడండి
షావోమి ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లో ఈ రెడ్మి 8 A లాంచ్ కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. యూజర్లు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఈవెంట్‌ను ఆస్వాదించవచ్చు. ఇక ఈ రెడ్మి 8 A ధర గురించి మాట్లాడితే, అధికారికంగా ఈరోజు జరగనున్న ఈవెంట్ ద్వారా వ్యాఖ్తమవుతుంది. కాని, కంపెనీ ఈ ఫోన్ను రెడ్మి 7 A ధర కు కొంచం అటుఇటుగా ప్రకటించవచ్చని తెలుస్తోంది.రెడ్మి 7 A యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 5,999.ఇక్కడ నుండి లైవ్ కార్యక్రమాన్ని చూడండి.
గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మరియు షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనూ కుమార్ జైన్, ఇటీవల ఈ రెడ్‌మి 8 ఎ స్మార్ట్‌ఫోన్ చిత్రాన్ని ఆన్లైన్లో షేర్ కూడా చేశారు. ఈ చిత్రం ఈ ఫోన్ యొక్క డిజైన్ ను వెల్లడిస్తుంది మరియు రెడ్మి 8A USB టైప్ -సి పోర్ట్‌తో తీసుకురాబడుతుందని ధృవీకరించబడింది, ఇది వేగవంతమైన ఛార్జింగ్‌కు తోడ్పడుతుంది. ఈ ధరలో యుఎస్‌బి-సి పోర్ట్‌తో వచ్చే మొదటి ఫోన్ ఇదే అవుతుంది.
ఇమేజి సోర్స్:Teena