ఇండియాలో విడుదలకు సిద్ధమైన REDMI 8 స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

అక్టోబర్ 9 న లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.

షావోమి, ఇటీవల తన రెడ్మి 8 A మొబైల్ ఫోన్ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయి ఎక్కువ సమయం కూడా గడవకుండానే, తన  రెడ్మి 8 ని కూడా త్వరలో భారత్‌లో లాంచ్ కానున్నట్లు షావోమి ఇండియా ఎండి మనూ కుమార్ జైన్ సమాచారం ఇచ్చారు. ఈ రెడ్మి 8 స్మార్ట్‌ ఫోన్ను అక్టోబర్ 9 న లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రెడ్మి 7 మొబైల్ యొక్క కొత్త తరం మొబైల్ ఫోన్‌గా ఇది ఉండబోతోంది. ఈ మొబైల్ ఫోన్ గురించి చాలా ప్రత్యేకమైన విషయంగా దాని బ్యాటరీ మరియు కెమెరా గురించి చెబుతున్నారు.

ఈ మొబైల్ ఫోన్ లాంచ్ మరియు దాని యొక్క కొన్ని ప్రత్యేకతల గురించి కంపెనీ ఒక ట్వీట్ చేసింది మరియు సూచనలు కూడా ఇచ్చింది, ఈ మొబైల్ ఫోన్ గొప్ప బ్యాటరీ మరియు శక్తివంతమైన కెమెరాతో పొందబోతోందని తెలుస్తోంది. ఇది ఈ మొబైల్ ఫోన్ యొక్క అతిపెద్ద లక్షణం కూడా అవుతుంది.

అయితే, ముందుగా చెప్పినట్లు చైనాలో విడుదలచేసిన రెడ్మి నోట్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లను కూడా ఇండియాలో ఇదే రోజు లాంచ్ చేయవచ్చని కూడా అంచనావేస్తున్నారు. ఎందుకంటే, రానున్న 8 వారాల్లో ఈ ఫోనల్ను ఇండియాలో విడుదల చేయనున్నట్లు, జైన్ ముందుగానే ప్రకటించారు.

రెడ్మి నోట్ 8 ప్రత్యేకతలు (చైనా)

షావోమి రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోన్‌లో, ఒక 6.3-అంగుళాల డాట్ నాచ్ స్క్రీన్ లభిస్తుంది, దీనికి తోడు ఇది సరికొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్ తో లభిస్తుంది. ఇక ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెటప్ అందుతుంది. దీనిలో, ఒక 48MP ప్రాధమిక కెమెరా వస్తుంది. దేనికి జతగా, ఒక  8MP 120 డిగ్రీల అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, మరొక 2MP మాక్రో లెన్స్ మరియు చివరిదిగా ఒక 2MP డెప్త్ సెన్సారుతో ఉంటుంది . దీని ద్వారా మీరు పోర్ట్రెయిట్ ఫోటోలను తీయవచ్చు. ఈ ఫోన్ ముందు భాగంలో ఒక 13MP తక్కువ-కాంతి(Low-Light ) కెమెరాని అందించింది. ఇది AI ఎనేబుల్ తోమంచి ఫోటోలను తీయవచ్చు.

ఇందులో ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని  అందించింది. అలాగే, ఇందులో కూడా ఒక 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇచ్చింది మరియు ఇది యుఎస్‌బి టైప్ సి పోర్టుతో ఉంటుంది.

షావోమి రెడ్మి నోట్ 8 ధర (చైనా)

రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోన్ యొక్క బేస్  వేరియంట్ చైనాలో  RMB 999 ధరతో ప్రకటించింది, అంటే మనకు ఇది సుమారు 10,000 రూపాయలు అవుతుంది. ఈ ధర వద్ద మీరు 4GB RAM మరియు 64GB స్టోరేజి ఫోన్ను పొందవచ్చు. ఇది కాకుండా,  6GB ర్యామ్ మరియు 64GB వేరియంట్‌ను RMB 1,199 ధరతో  ప్రకటించింది, అంటే సుమారు 12,000 రూపాయలు అన్నమాట. మరొక వేరియంట్ అయినటువంటి 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ మోడల్‌ను సుమారు RMB 1,399 ధరతో తీసుకచ్చింది, అంటే సుమారు 14,000 రూపాయలు.

రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు (చైనా)

ఇది కాకుండా, రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్ గురించి చూస్తే, ఇది ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది 3D  కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే తో వస్తుంది. మీరు దీన్ని కొత్త జాడే గ్రీన్ కలర్‌లో అందుకోనున్నారు. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకముగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్‌ తోఈ స్మార్ట్ ఫోన్నుఅందుకోనున్నారు .

రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్‌లో, గరిష్టంగా ఒక  64 MP కెమెరాను అందుకోనున్నారు, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది.

రెడ్మి నోట్ 8 ప్రో ధర (చైనా)

ఈ రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్ యొక్క ధరల విషయానికి వస్తే,  6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ మోడల్‌ను RMB 1,399 ధరకే తీసుకోవచ్చు, అంటే సుమారు 14,000 రూపాయలు మాత్రమే అవుతుంది. ఇది కాకుండా, మరొక 6GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌ను సుమారు RMB 1,599 ధరతో అందించింది, అంటే సుమారు 16,000 రూపాయలు. అయితే, హై ఎండ్ వేరియంట్ అయినటువంటి 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌ను తీసుకోవాలనుకుంటే, RMB 1,799 ధర వద్ద తీసుకోవచ్చు, అంటే సుమారు 18,000 రూపాయలు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :