రెడ్మి 8 మరియు రెడ్మి నోట్ 8 ఫ్లాష్ సేల్ మరికొద్ది సేపట్లో : రూ. 750 డిస్కౌంట్ అందుకునే అవకాశం

HIGHLIGHTS

ఈ సేల్ అమేజాన్ మరియు mi.com ద్వారా జరగనుంది.

భారతదేశంలో షావోమి సంస్థ బడ్జెట్ వినియోగదారులను టార్గెట్ గా చేసుకొని మంచి ట్రెండీ ఫీచర్లతో 8 సిరీస్ నుండి తీసుకొచ్చినటువంటి, రెడ్మి 8 మరియు రెడ్మి నోట్ 8 ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. ఈ సేల్ అమేజాన్ మరియు mi.com ద్వారా జరగనుంది. అయితే,ఈరోజు జరగనున్న సేల్ లో అమేజాన్ నుండి ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్స్ మరియు EMI పైన ఈ ఫోన్ను కొనేవారికి 750 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందుకోవచ్చు.           

రెడ్మి 8 : ధర

1. రెడ్మి 8 (4GB +64GB ) ధర – Rs.7,999

రెడ్మి నోట్ 8   : ధరలు

1. రెడ్మి నోట్ 8 (4GB +64GB ) – Rs.9,999/-

2. రెడ్మి నోట్ 8 (6B +128GB ) – Rs.12,999/-

రెడ్మి 8 :స్పెసిఫికేషన్స్

ఈ రెడ్మి 8 డ్యూయల్ – సిమ్  స్మార్ట్ ఫోన్ మరియు ఈ డివైజ్ 720P పిక్సల్స్ రిజల్యూషన్ గా కలిగిన ఒక 6.22 అంగుళాల HD+  డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో  అందించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ను Aura Mirror డిజైన్ తో చేయడంవలన, వెనుక ప్యానల్ మెరిసేలా ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.0GHz క్లాక్ స్పీడ్ అందించగల ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 3GB/4GB ర్యామ్ తో వస్తుంది. ఇది రెండువేరియంట్లలో వరుసగా 32GB,64GB  స్టోరేజి కలిగివుంటుంది. ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజిని 512 GB వరకూ పెంచుకోవచ్చు.    

ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు కేవలం ఒక 12MP ప్రధాన కెమేరాకు జతగా మరొక 2MP డెప్త్ సెన్సార్ జతగా డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇది Sony IMX363 సెన్సారుతో ఉంటుంది. అలాగే,  ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP  కెమెరా ఉంటుంది. ఇక ఈ ఫోన్ను బలమైన 5,000 mAh బ్యాటరీతో మరియు 18W స్పీడ్ ఛార్జింగ్ సపోర్టుతో తీసుకొచ్చింది. అలాగే, సెక్యూరిటీ పరంగా ఫేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను కూడా అందించింది. ఇది ఓనిక్స్ బ్లాక్, సఫైర్ బ్లూ,  రూబీ రెడ్ మరియు ఏమిరాల్డ్ గ్రీన్ వంటి నాలుగు రంగుల ఎంపికలతో లభిస్తుంది.     

రెడ్మి నోట్ 8 ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8  ఒక 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అదనంగా, ఇందులో 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ తో వచ్చింది. దీనికి జతగా ఒక 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  48 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 13MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 లో,ఒక 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అంతేకాదు, ఇది 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది.                       

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :