REDMI 7A స్మార్ట్ ఫోన్ కేవలం రూ.5799 ధరతో విడుదలయ్యింది : ఇవే ప్రత్యేకతలు

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ జూలై 11 వ తేదీ నుండి Flipkart మరియు Mi.com ద్వారా జరగనుంది.

REDMI 7A స్మార్ట్ ఫోన్ కేవలం రూ.5799 ధరతో విడుదలయ్యింది : ఇవే ప్రత్యేకతలు

ముందుగా ఊహించినట్లుగానే, చైనాలో బడ్జెట్ ధరలో మంచి స్పెక్స్ తో విడుదలైనటువంటి షావోమి యొక్క రెడ్మి 7A ని ఇండియాలో అతితక్కువ ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, రూ. 5,999 ధరలో పెద్ద బ్యాటరీ మంచి డిస్ప్లే మరియు మరిన్ని ట్రెండీ ఫీచర్లతో విడుదలయ్యింది. అయితే, జూలై నెలలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారికి మాత్రం 200 రూపాయల ధరను తగ్గించి రూ. 5,799 ధరకె అందిస్తోంది. షావోమి, ఈ కార్యక్రమాన్ని తన ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అందించింది.  అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ జూలై 11 వ తేదీ నుండి Flipkart మరియు Mi.com ద్వారా జరగనుంది.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షావోమి రెడ్మి 7A రెగ్యులర్ ధరలు

షావోమి రెడ్మి 7A  – 2GB + 16GB – రెగ్యులర్ ధర : Rs.5999 

షావోమి రెడ్మి 7A  – 2GB + 32GB – రెగ్యులర్ ధర : Rs.6199 

షావోమి రెడ్మి 7A జూలై అఫర్ ధరలు

షావోమి రెడ్మి 7A  – 2GB + 16GB – జూలై అఫర్ ధర : Rs.5799

షావోమి రెడ్మి 7A  – 2GB + 32GB – జూలై అఫర్ ధర : Rs.5999

షావోమి రెడ్మి 7A ప్రత్యేకతలు

షావోమి రెడ్మి 7A స్మార్ట్ ఫోన్, ఒక పాలికార్బోనేట్ తో ఇవ్వబడింది మరియు ఇది P2i నానో-కోటింగ్ ద్వారా అందించబడింది కాబట్టో స్ప్లాష్ ప్రూఫ్ గా పనిచేస్తుంది. ఈ షావోమి రెడ్మి 7A ను 18:9 ఆస్పెక్ట్ రేషియో కలిగినటువంటి ఒక 5.45 అంగుళాల HD+ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో అందించింది. అలాగే, ఇది ఒక 2.0 GHz వరకు క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసరుకు జతగా, 2GB ర్యామ్ మరియు 16 GB లేదా 32 GB ఎంపికలతో వస్తుంది. అధనంగా, ఆండ్రోయిడ్ 9 పై ఆధారంగా MIUI 10 OS తో లాంచ్ చేశారు.

ఇక ఈ ఫోన్ యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది ఒక 12MP సింగిల్ రియర్ కేమేరా Sony IMX 486 సెన్సారుతో అందించబడింది. ముందుభాగంలో సెల్ఫీ కోసం, ఈ ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ షావోమి పరికరం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది, ఇది 10W ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile