Redmi 17C రేపు లాంచ్ అవుతోంది .. కానీ కంప్లీట్ ఫీచర్స్ అండ్ ప్రైస్ ఈరోజే తెలుసుకోండి.!

HIGHLIGHTS

Redmi 17C స్మార్ట్ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది

ప్రీమియం లెదర్ బ్యాక్ డిజైన్ మరియు భారీ బ్యాటరీ సెటప్ తో లాంచ్ అవుతోంది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు ప్రైస్ ఈరోజే తెలుసుకోండి

Redmi 17C స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం లెదర్ బ్యాక్ డిజైన్ మరియు భారీ బ్యాటరీ సెటప్ తో లాంచ్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ లో మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ రేపు లాంచ్ అవుతుంది, కానీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు ప్రైస్ ఈరోజే తెలుసుకోండి.

Redmi 17C లాంచ్ సమయం

రెడ్ మీ 17c స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో లాంచ్ అవుతుంది. అంటే, రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది.

Redmi 17C : ఫీచర్స్

రెడ్ మీ ఈ ఫోన్ ను 6.9 ఇంచ్ బిగ్ LCD స్క్రీన్ తో అందిస్తోంది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు HD ప్లస్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క బడ్జెట్ 5జి చిప్ సెట్ Dimensity 6300 తో రిలీజ్ అవుతుంది. ఈ ఫోన్ ను మరింత వేగంగా చేయడానికి 4 జీబీ ఫిజికల్ ర్యామ్ జతగా 4 జీబీ అదనపు ర్యామ్ తో మొత్తం 8 జీబీ ర్యామ్ తో అందిస్తుంది. ఈ రెడ్ మీ కొత్త ఫోన్ హైపర్ OS 3 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది మరియు 48 నెలల సాఫ్ట్ వేర్ అప్‌ డేట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో అల్ట్రా HD మోడ్ సపోర్ట్ కలిగిన 50MP AI మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్, పోర్ట్రైట్, సెల్ఫీ బ్యూటీ మోడ్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ డిజైన్ కూడా చాలా గొప్పగా ఉంది. ఈ ఫోన్ ను ప్రీమియం లెథర్ తో మలిచింది మరియు చాలా స్లీక్ డిజైన్ లో అందించింది.

Also Read: Amazon GIF Sale టాప్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ లైవ్ చేసిన అమెజాన్ .. చవక ధరలో లభిస్తుంది.!

ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ వుంది. అలాగే, ఈ ఫోన్ లో 33W టర్బో ఛార్జింగ్ ఫీచర్ మరియు బ్యాటరీని మేనేజ్ చేసే స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ ని కూడా ఈ ఫోన్ లో అందించింది. ఇది కాకుండా 300% వాల్యూమ్ మోడ్ సపోర్ట్ కలిగిన స్పీకర్ ని కూడా ఇందులో అందించింది. ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ తో పాటు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ ఫీచర్ ని కూడా కలిగి ఉంటుంది.

అంచనా ప్రైస్

షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ. 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే, ఈ ఫోన్ ను రూ. 16,999 నుంచి రూ. 18,999 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఫోన్ ఎటువంటి ధరలో వస్తుందో, రేపు క్లియర్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :