Redmi 17C launch confirmed with big display and big battery
Redmi 17C స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను ఈరోజు షియోమీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మోర్ డిస్ప్లే అండ్ మోర్ బ్యాటరీతో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ను దసరా పండుగ కంటే ముందే రిలీజ్ చేస్తుందంటే, దసరా పండుగ సందర్భంగా నడుస్తున్న సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకొస్తుంది. రెడ్ మీ 17c స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
రెడ్ మీ 17c స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 1వ తేదీన ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు షియోమీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది. అంటే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ నుంచి సేల్ చేస్తుంది. అంటే, ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉండవచ్చు.
రెడ్ మీ 17c స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం లెథర్ బ్యాక్ మరియు స్లీక్ డిజైన్ కలిగిన ఆల్ న్యూ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ డిజైన్ సరికొత్తగా మరియు చాలా ప్రీమియంగా ఈ ఫోన్ ను చూపించింది. ఈ ఫోన్ డిజైన్ ను ఆస్ట్రల్ డెకో డిజైన్ గా కంపెనీ అభివర్ణించింది. అలాగే, ఈ ఫోన్ ను పర్పల్ డాన్, డార్క్ నైట్ మరియు కాఫీ బ్రూ అనే మూడు సరికొత్త రంగుల్లో లాంచ్ చేస్తునట్లు కూడా వెల్లడించింది. అలాగే, నాలుగు వైపులా కర్వ్ డిజైన్ తో చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉండేలా డిజైన్ చేసినట్లు తెలిపింది.
ఈ ఫోన్ లో 6.9 ఇంచ్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన బిగ్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అలాగే, ఇందులో 4 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 4 జీబీ వర్చువల్ ర్యామ్ తో టోటల్ 8 జీబీ ర్యామ్ ఫీచర్ అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ హైపర్ OS 3 తో వస్తుంది 48 నెలల సాఫ్ట్ వేర్ అప్‌డేట్ అందుకుంటుంది.
Also Read: Jio Offer: క్రియేటర్స్ కి గుడ్ న్యూస్ అందించిన రిలియన్స్ జియో.!
కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో అల్ట్రా HD మోడ్, పోర్ట్రైట్, సెల్ఫీ బ్యూటీ మోడ్ వంటి ఫీచర్స్ తో పాటు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీ ముఖ్యమైన ఫోన్ గా ఈ ఫోన్ గురించి రెడ్ మీ తెలిపింది. ఎందుకంటే, ఈ ఫోన్ ను 6000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తోంది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 33W టర్బో ఛార్జింగ్ మరియు స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, 300% వాల్యూమ్ మోడ్ మరియు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది.