Redmi 17 5G న్యూ లుక్ తో ఈరోజు లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!

HIGHLIGHTS

రెడ్ మీ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 17 5G ని విడుదల చేసింది

బిగ్ బ్యాటరీ, బిగ్ డిస్ప్లే మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో రిలీజ్ చేసింది

ఫోన్ లో క్వాల్కమ్ 4nm ప్రాసెసర్ Snapdragon 4 Gen 5 ని అందించింది

రెడ్ మీ ఈరోజు ఇండియన్ మార్కెట్లో సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 17 5G ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ని బిగ్ బ్యాటరీ, బిగ్ డిస్ప్లే మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో రిలీజ్ చేసింది. ఈరోజు షియోమీ ఇండియన్ మార్కెట్లో సరికొత్త గా విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి.

Redmi 17 5G ప్రైస్ అండ్ ఆఫర్స్

షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ ని అండర్ రూ. 25,000 బడ్జెట్ సెగ్మెంట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ బేసిక్ 6GB ర్యామ్ వేరియంట్ ని రూ. 23,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ 8GB ర్యామ్ వేరియంట్ ని రూ. 26,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్స్ కూడా 128GB స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ ఎటర్నల్ ఆరెంజ్, ఎండ్ లెస్ బ్లూ మరియు అబ్సల్యూట్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది.

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కంపెనీ ఎటువంటి ప్రత్యేకమైన ఆఫర్స్ అందించలేదు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ షియోమీ అఫీషియల్ సైట్ మరియు అమెజాన్ నుంచి సేల్ అవుతుంది.

Also Read: MIVI One 5G: స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టిన హైదరాబాద్ బేస్డ్ ఆడియో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్.!

Redmi 17 5G: ఫీచర్స్

షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ ని పెద్ద 6.9 ఇంచ్ డిస్ప్లేతో అందించింది. ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 825 నిట్స్ HBM బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ 4nm ప్రాసెసర్ Snapdragon 4 Gen 5 ని అందించింది. అలాగే, ఈ ఫోన్ లో 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ని అందించింది. ఈ ఫోన్ Hyper OS 3 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో పని చేస్తుంది.

ఈ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరాతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మంచి రిజల్యూషన్ అందించే HEVC వీడియో రికార్డింగ్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. షియోమీ ఈ ఫోన్ లో 7900 mAh భారీ బ్యాటరీ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 22.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ని కూడా అందించింది. ఈ ఫోన్ IP64 రెయిన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ డిజైన్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :