Redmi 15A launching with 6.9 inch big screen
Redmi 15A : షియోమీ అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ 15a లాంచ్ డేట్ లో కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను బిగ్ స్క్రీన్ మరియు మంచి డిజైన్ తో లాంచ్ చేస్తోంది. రెడ్ మీ నెంబర్ సిరీస్ నుంచి రాబోతున్న ఈ అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
రెడ్ మీ 15a స్మార్ట్ ఫోన్ మార్చి 27వ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ ఈ ఫోన్ ఫీచర్స్ కూడా వెల్లడించింది.
రెడ్ మీ 15a స్మార్ట్ ఫోన్ ను 6.9 ఇంచ్ బిగ్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు రెడ్మీ ప్రకటించింది. ఈ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కోసం తగిన పార్ట్నర్ అవుతుందని రెడ్ మీ చెబుతోంది. ఈ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ లో ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ఇంకా బయటకు వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ నెట్టింట్లో లీక అయ్యాయి.
Also Read: Realme P4 Lite 5G: సింగల్ డే బిగ్ డీల్స్ తో ఫస్ట్ సేల్ రేపు జరుగుతుంది.!
రెడ్ మీ 15a స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.9 ఇంచ్ స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఇది HD+ రిజల్యూషన్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T8300 చిప్ సెట్ తో లాంచ్ చేస్తుందని లీక్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో 4GB ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ అందించే అవకాశం ఉందని కూడా లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ హైపర్ OS 3 జతగా ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా వివరాలు కూడా లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ లో 32MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 6300mAh భారీ బ్యాటరీ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా లీక్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఇదే లీక్స్ వెల్లడించాయి.
ఓవరాల్ గా ఈ ఫోన్ ఎంట్రీ లెవల్ 5జి ఎంటర్టైన్మెంట్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టె అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ 10 వేల రూపాయల బడ్జెట్ లో రావచ్చని అంచనా వేసున్నారు.