Redmi 14C 5G: గ్లోబల్ డెబ్యూట్ ను ఇండియా నుంచి కన్ఫర్మ్ చేసిన షియోమీ.!
Redmi 14C 5G ను ఇండియా తో సహా గ్లోబల్ డెబ్యూట్ గా లాంచ్ చేస్తున్న షియోమీ
ప్రీమియం స్టార్ లైట్ డిజైన్ తో లాంచ్ చేస్తోందని కూడా షియోమీ తెలిపింది
14C 5G లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ తో షియోమీ టీజింగ్ చేస్తోంది
Redmi 14C 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియా తో సహా గ్లోబల్ డెబ్యూట్ గా లాంచ్ చేస్తున్నట్లు షియోమీ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం స్టార్ లైట్ డిజైన్ తో లాంచ్ చేస్తోందని కూడా షియోమీ తెలిపింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ తో షియోమీ టీజింగ్ చేస్తోంది.
SurveyRedmi 14C 5G : లాంచ్ డేట్
రెడ్ మీ 14సి 5జి స్మార్ట్ ఫోన్ ను జనవరి 6వ తేదీ ఇండియాలో విడుదల చేస్తుందని షియోమీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి తో టీజింగ్ చేస్తోంది.
Redmi 14C 5G : ఫీచర్స్
రెడ్ మీ 14సి 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం స్టార్ లైట్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను పెద్ద రౌండ్ బంప్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ ను డ్యూయల్ 5G సపోర్ట్, ఫాస్ట్ డౌన్ లోడ్స్, ల్యాగ్ ఫ్రీ వీడియో కాలింగ్ మరియు మంచి గేమింగ్ అందించగల వేగవంతమైన చిప్ సెట్ తో లాంచ్ చేస్తుందని రెడ్ మీ టీజింగ్ చేస్తోంది.

ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ వేరియంట్ లలో లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది. టీజర్ ఇమేజ్ ద్వారా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో వాటర్ డ్రాప్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. రానున్న రోజులో ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ ను ఒక్కొక్కటిగా వెల్లడిస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read: Lava Yuva 2 5G: స్టైలిష్ నోటిఫికేషన్ లైట్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన లావా.!
ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో తీసుకు వచ్చే అవకాశం వుంది. కంపెనీ తెలిపిన ప్రకారం పెద్ద మరియు స్మూత్ డిస్ప్లేతో ఈ ఫోన్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
