Redmi 13 5G బడ్జెట్ ధరలో 108MP కెమెరాతో వచ్చింది..ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

HIGHLIGHTS

Xiaomi ఈరోజు Redmi 13 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ని బడ్జెట్ ధరలో 108MP కెమెరా వంటి మరిన్ని ఫీచర్స్ తో విడుదల చేసింది

రెండు వేరియంట్స్ మరియు మూడు కలర్ ఆప్షన్ లతో అందించింది

Redmi 13 5G బడ్జెట్ ధరలో 108MP కెమెరాతో వచ్చింది..ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

ఇండియన్ మార్కెట్ లో ఈరోజు Redmi 13 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది Xiaomi. ఈ స్మార్ట్ ఫోన్ ని బడ్జెట్ ధరలో 108MP కెమెరా వంటి మరిన్ని ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ మరియు మూడు కలర్ ఆప్షన్ లతో అందించింది. ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi 13 5G: ప్రైస్

రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో, బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 13,999 ధరతో అందించింది. రెండవ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 15,999 ధరతో ప్రకటించింది. జూలై 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ ను mi.com మరియు అమెజాన్ ఇండియా నుండి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది.

Also Read: Lava Blaze X: 64MP Sony కెమెరా అద్భుతమైన డిజైన్ తో రేపు లాంచ్ అవుతోంది.!

Redmi 13 5G: ఫీచర్లు

రెడ్ మీ 13 5జి స్మార్ట్ ఫోన్ లో 6.79 ఇంచ్ FHD+ డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్ 120HZ అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ తో అందంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో మంచి ప్రోసెసర్ ను అందించింది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 AE చిప్ సెట్ ను అందించింది. దానికి జతగా 8GB ర్యామ్ + 8GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అందించింది.

Redmi 13 5G
Redmi 13 5G

ఈ ఫోన్ కెమెరాను కూడా ఆకట్టుకునేలా అందించింది. ఈ ఫోన్ లో 108MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు రింగ్ ఫ్లాష్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు హైబ్రిడ్ సిమ్ స్లాట్ కూడా వుంది. ఈ ఫోన్ ను 5030mAh బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ బ్లాక్ డైమండ్, హవాయి బ్లూ మరియు ఆర్కిడ్ పింక్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo