Realme X7 Series: అబ్బుర పరుస్తున్న లీక్డ్ స్పెక్స్ మరియు డిజైన్

Realme X7 Series: అబ్బుర పరుస్తున్న లీక్డ్ స్పెక్స్ మరియు డిజైన్
HIGHLIGHTS

Realme X7 Series నుండి త్వరలో లాంచ్ కానున్న Realme X7 మరియు Realme X7 Pro వివరాలను రియల్ మీ ముందుగానే వెల్లడించింది.

Realme సంస్థ యొక్క X‌-సిరీస్‌ లో భాగంగా ఈ ఫోన్లను సెప్టెంబర్ 1 న ప్రారంభించనుంది.

ఈ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్ 120 Hz హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో పాటు కొన్ని ప్రత్యేకమైన స్పెసిఫికేషన్లు ఆన్ ‌లైన్ ‌లో లీక్

Realme X7 Series నుండి త్వరలో లాంచ్ కానున్న Realme X7 మరియు Realme X7 Pro వివరాలను రియల్ మీ ముందుగానే వెల్లడించింది. Realme సంస్థ యొక్క X‌-సిరీస్‌ లో భాగంగా ఈ ఫోన్లను సెప్టెంబర్ 1 న ప్రారంభించనుంది. ఈ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్స్ 120 Hz హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో పాటు కొన్ని ప్రత్యేకమైన  స్పెసిఫికేషన్లు ఆన్ ‌లైన్ ‌లో లీక్ అవుతున్నట్లు ధృవీకరించబడింది.

Realme X7 Series చిత్రాలను కంపెనీ CMO , జు క్వి చేజ్ మరియు డిజైన్ డైరెక్టర్ జియాన్‌ ఘై సైర్ ఆన్ ‌లైన్‌ నుండి Weibo లో షేర్ చేశారు. ఈ ఫోన్ ట్రై-కలర్ గ్రేడియంట్ డిజైన్‌ లో వచ్చినట్లు కంపెనీ చెబుతోంది “Dare to Leap” వెనుక ప్యానెల్‌ కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రియల్ మీ యొక్క మాత్రం ఎప్పటి లాగానే చిన్నగా కనిపిస్తోంది.

Realme ఇప్పటి వరకూ విడుదల చేసిన అన్ని చిత్రాలను ఈ క్రింద చూడవచ్చు.

Realme X7 Series: Leaked స్పెక్స్

రియల్‌ మీ X 7 ప్రో, FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ మరియు 120 హెర్ట్జ్ హై రిఫ్రెష్ రేట్‌తో ఒక 6.55-అంగుళాల AMOLED స్క్రీన్ ‌ను కలిగి ఉందని రూమర్ ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఈ డిస్ప్లే లో సింగిల్ పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది మరియు ఇది 20: 9 యాస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. ఈ స్క్రీన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్  కూడా కలిగివుంటుంది.

X7 ప్రో 2.6GHz మరియు మాలి-జి 77 GPU వద్ద క్లాక్ చేయబడిన లేటెస్ట్ ఆక్టా-కోర్ CPU అయిన  MediaTek Dimensity 1000+ చిప్ ‌సెట్ తో  తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇది 6GB / 8GB RAM మరియు 128GB / 256GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా Realme UI  ‌లో ఫోన్ నడుస్తుంది.

రియల్‌ మీ X 7 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ తో వస్తుంది, దీనిలో f/ 1.8 ఎపర్చరు గల ప్రాధమిక 64 MP  కెమెరాతో , 8 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ, 2 MP మాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ . వెనుక కెమెరాలు వీడియోలను, 30FPS వద్ద 4K రిజల్యూషన్ తో మరియు 1080p రిజల్యూషన్ తో 60FPS వరకు రికార్డ్ చేయగలవు. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉంది.

రియల్ ‌మీ ఎక్స్‌ 7 ప్రో లో 4,500 mAh  బ్యాటరీ అమర్చబడి 65W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్‌కు మద్దతు ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo