Realme X7 max 5G పైన 6 వేల రూపాయల భారీ డిస్కౌంట్

Realme X7 max 5G పైన 6 వేల రూపాయల భారీ డిస్కౌంట్
HIGHLIGHTS

Realme X7 max 5G పైన భారీ అఫర్

6,000 రూపాయల అతిభారీ డిస్కౌంట్

Realme X7 max 5G ఫోన్ టాప్ ఫీచర్లతో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పైన ఇప్పుడు భారీ అఫర్ ను అందుకోండి. Flipkart నుండి ప్రకటించిన Realme Days Slae నుండి  Realme 5G ఫోన్ పైన 6,000 రూపాయల అతిభారీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ 9వ తేదీన మొదలైన ఈ సేల్ రేపటితో ముగుస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ మీడియాటెక్ స్పీడ్ ప్రాసెసర్ Dimensity 1200 5G తో వచ్చింది. అంతేకాదు, Super AMOLED డిస్ప్లే మరియు 50W స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా మరిన్ని భారీ ఫీచర్లతో Realme X7 max 5G ను విడుదల చేసింది.

Realme X7 max 5G: ధర

Realme X7 max 5G స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. వాటి ధరలు ఈ క్రింద చూడవచ్చు

1. Realme X7 max 5G (8GB+128GB) : రూ. 26,999

2. Realme X7 max 5G (12GB+256GB) : రూ. 29,999

Realme X7 max 5G స్మార్ట్ ఫోన్ ను ప్రీ పేమెంట్ ద్వారా కొనుగోలుచేసే వారికీ 6 వేల రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. Check Offer Here

Realme X7 max 5G: స్పెక్స్

రియల్మి ఎక్స్7 మ్యాక్స్ 5G స్మార్ట్ ఫోన్ 1. డిస్ప్లే 6.43 అంగుళాల 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ గల FHD+ Super AMOLED డిస్ప్లే   పంచ్ హోల్ డిజైనుతో ఉంటుంది. ఈ డిస్ప్లే యొక్క అధనపు ఫీచర్ల గురించి చూస్తే, ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఈ డిస్ప్లే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు 100% DCI-P3 వైడ్ కలర్ గ్యాంబిట్ తో వస్తుంది.

ఈ ఫోన్ మంచి 5G పర్ఫార్మెన్స్ అందించగల, మీడియాటెక్ యొక్క లేటెస్ట్  ప్రొసెసర్ Dimensity 1200 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 3.0GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న ARM Mali-G77 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి మరియు హెవీ గేమ్స్ కూడా ప్లే చేయవచ్చు.

కెమెరా విషయానికి వస్తే, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పును అందించింది. ఈ ట్రిపుల్ కెమెరాలో, ప్రధాన కెమెరాని 64MP Sony IMX682 సెన్సార్ తో ఇంచింది. రెండవ కెమేరాగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, మూడవ కెమెరాని  2MP మ్యాక్రో లెన్స్ తో ఇచ్చింది. ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 16MP సెల్ఫీ కెమెరా ఇచ్చింది.

Realme X7 max 5G  ఒక 4,500mAh బ్యాటరీతో వుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని వేగవంతమైన టైప్-C 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. ఈ వేగవంతమైన ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు. కేవలం 16 నిముషాల్లోనే 50% ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo