64MP క్వాడ్ AI కెమేరా మరియు 65W సూపర్ డార్ట్ ఛార్జ్ తో రియల్మీ X50 ప్రో 5G లాంచ్ కావచ్చు

ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరొక కొత్త ట్రెండ్ దూసుకొస్తోంది, అదే 5G స్మార్ట్ ఫోన్ల ట్రెండ్. ఇప్పటి వరకూ ఇతర దేశాల్లో హల చల్ చేసిన ఈ ట్రెండ్ ఇక మన మార్కెట్ని కూడా ముంచెత్తనుంది. ప్రస్తుతం, ఈ నెల 24 వతేదీకి 5G సపోర్టుతో రియల్మీ సంస్థ ఇండియాలో లాంచ్ చెయ్యనున్న Realme X50 Pro 5G స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకతలను ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. 

ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమేరా మరియు వెనుక క్వాడ్ కెమేరాతో మొత్తంగా 6 కెమెరాలతో విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించిన విష్యం తెలిసిందే. అయితే, ప్రస్తుత ట్విట్టర్ ద్వారా టీజ్ చేస్తున్న ఇమేజిలను చూస్తుంటే, ఇది 64MP AI క్వాడ్ కెమేరాతో ఈ ఫోన్ తీసుకువస్తునట్లు భావిస్తున్నారు. అలాగే, ఈ ఇమేజిలను చూస్తుంటే, ఇందులో అందించిన కెమేరా అద్భుతమైన ఫోటోలను తియ్యగలదని కూడా ఊహిస్తున్నారు.    

 

https://twitter.com/realmemobiles/status/1230379052826943489?ref_src=twsrc%5Etfw

 

పైన తెలిపిన వివరాలతో పాటుగా,  ఈ స్మార్ట్ ఫోనులో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అందించినట్లు ప్రకటించింది. దీని గురించి, ఇది 65W సూపర్ డార్ట్ ఛార్జ్ టెక్నాలజీగా చెబుతోంది. ఇటీవల రియల్మీ నుండి ఒక 50W Super Vooc ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో వచ్చినటువంటి రియల్మీ X2 ప్రో రియల్ టైం ఛార్జింగ్ స్టేటస్ ని చూపిస్తే, ఇక ఇప్పుడు రియల్మీ ప్రకటించిన ఈ 65W సూపర్ డార్ట్ ఛార్జ్ టెక్నాలజీ మరింకెంత ఫాస్ట్ గా ఛార్జ్ చేస్తుందో అని చర్చిసున్నారు.                                        

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :