జనవరి 7 న విడుదలకానున్న REALME 5G స్మార్ట్ ఫోన్

Updated on 26-Dec-2019
HIGHLIGHTS

ఇందులో సోనీ IMX686 సెన్సార్‌తో 60 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది

మునుపటి నివేదికలకు అనుగుణంగా, రియల్మి X50 5G లాంచ్ డేట్ ని కంపెనీ వెల్లడించింది. X50 5G యొక్క లాంచ్ ను గురించి సంస్థ యొక్క CMO టీజ్ చేసినప్పటికీ, ఇది ఖచ్చితమైన తేదీని వెల్లడించలేదు. ఇప్పుడు, రియల్మి తన మొదటి 5 జి స్మార్ట్‌ ఫోన్- రియల్మి X 50 5G జనవరి 7 న చైనాలో అధికారికంగా లాంఛనప్రాయంగా విడుదలవుతుందని చెప్పారు. ఈ రాబోయే 5 జి స్మార్ట్‌ ఫోనులోని కీలకమైన ప్రత్యేకతలను కంపెనీ ఇప్పటికే షర్ చేసింది.

రియల్మి X 50 5G లో ఒక 6.6 అంగుళాల డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ తో ఉంటుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి SoC చేత శక్తినివ్వనున్నదని ధృవీకరించబడింది. ఈ స్మార్ట్‌ ఫోనులో 8 జీబీ ర్యామ్ అమర్చవచ్చు. అంతేకాకుండా, ఈ రియల్మి ఎక్స్‌ 50 5G లోపల ఉన్న అన్ని భాగాలను “పెంటా డైమెన్షనల్ ఐస్-కూల్డ్ హీట్ డిసిపేషన్ సిస్టమ్” ద్వారా చల్లబరుస్తామని కంపెనీ తెలిపింది. రియల్మి ప్రకారం, ఈ వ్యవస్థ మొత్తం వ్యవస్థ భాగాలు వేడిలో 100 శాతం కవర్ చేస్తుందని తెలిపింది. కూలింగ్ పరిష్కారంలో 8 మిమీ అల్ట్రా-లార్జ్ లిక్విడ్-కూల్డ్ కాపర్ ట్యూబ్ కూడా ఉంటుంది.

రియల్మి ఎక్స్ 50 5 జి క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో రావచ్చు, ఇందులో సోనీ IMX686 సెన్సార్‌తో 60 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ మరియు రెండు 2 మెగాపిక్సెల్ షూటర్లు (మ్యాక్రో కోసం ఒకటి మరియు పోర్ట్రెయిట్‌లకు ఒకటి) ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫోనులో డ్యూయల్ సెల్ఫీ షూటర్లు ఉండే అవకాశం ఉంది. ఇందులో 32 మెగాపిక్సెల్ ప్రధాన షూటర్ మరియు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ ఉండవచ్చు.

రియల్మి X50 5G ఒకే సమయంలో ఆన్‌ లైన్ కనెక్టివిటీ కోసం డ్యూయల్-ఛానల్ వై-ఫై మరియు 5 జికి మద్దతు ఇస్తుందని నిర్ధారించబడింది. రియల్మి X 50 5G,  5 జి కనెక్టివిటీ కోసం అన్ని ప్రధాన స్ట్రీమ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ లను కవర్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది, వీటిలో N1, N41, N78, N79 ఉన్నాయి. టీజర్ పోస్టర్‌ లో, రియల్మి ఎక్స్ 50 5 జి మెరుగైన VOOC 4.0 ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది, ఇది కేవలం 30 నిమిషాల్లో 70 శాతం వరకు పరికరాన్ని ఛార్జ్ చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :