Realme X3 Super Zoom మరియు రియల్మి ఎక్స్ 3 వచ్చేశాయి : కంప్లీట్ డీటెయిల్స్

Realme X3 Super Zoom మరియు రియల్మి ఎక్స్ 3 వచ్చేశాయి : కంప్లీట్ డీటెయిల్స్
HIGHLIGHTS

Realme X3 SuperZoom , Realme X3 , Realme Buds Q మరియు అడ్వెంచర్ బ్యాక్‌ప్యాక్ వంటి వాటిని ప్రకటించింది.a

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్యగల ప్రధాన భేదమైనటువంటి కెమెరా యొక్క జూమ్ సామర్థ్యాలు మినహా, రియల్మి X3 సూపర్ జూమ్ మరియు రియల్మి X3 ల మధ్య ఎక్కువ తేడా లేదు.

తూర్పు లడఖ్‌లో చైనా దళాలతో సరిహద్దు వాగ్వివాదం మధ్య,  చైనా వ్యతిరేక భావాలు బలంగా వీస్తున్నప్పటికీ, రియల్‌మి ఆన్‌లైన్- లాంచ్ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది. Realme X3 SuperZoom , Realme X3 , Realme Buds Q మరియు అడ్వెంచర్ బ్యాక్‌ప్యాక్ వంటి వాటిని ప్రకటించింది. వాటిలో, X3 SuperZoom ఇప్పటికే ఐరోపాలో అందుబాటులో ఉంది, ఇది మేలో ప్రారంభించబడింది. మిగతా మూడు ఉత్పత్తులు కంపెనీకి మొదటివి.

Realme X3 SuperZoom , Realme X3  స్పెక్స్ మరియు ఫీచర్స్

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్యగల ప్రధాన భేదమైనటువంటి కెమెరా యొక్క జూమ్ సామర్థ్యాలు మినహా, రియల్మి X3 సూపర్ జూమ్ మరియు రియల్మి X3 ల మధ్య ఎక్కువ తేడా లేదు. అందుకే, సారూప్యతలను ముందుగా చెక్ చేద్దాం.

Realme X3 SuperZoom మరియు Realme X3 రెండూ స్నాప్‌డ్రాగన్ 855+ చిప్సెట్ శక్తిని కలిగి ఉన్నాయి. గత సంవత్సరం ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో క్రొత్త స్మార్ట్ ‌ఫోన్ తీసుకురావడం కొంచెం వింతగా అనిపిస్తుంది. అయితే,

ఇది పనితీరుపై ఎక్కువ రాజీ పడకుండా, ఖచ్చితంగా 5G  మోడెమ్‌ను (ప్రస్తుతం భారతదేశంలో ఉపయోగం లేదు) దాటవేయడానికి ఒక తెలివైన మార్గం. స్నాప్‌డ్రాగన్ 855+ 7nm తయారీ ప్రక్రియపై ఆధారపడింది, దీని ప్రైమ్ కోర్ 2.96GHz వరకు వెళ్ళగలదు. గత సంవత్సరం Oneplus 7 T, AsusROG Phone II వంటి పరికరాల్లో మనం చూసినట్లుగా, సమర్ధవంతమైన అడ్రినో 640 GPU కూడా కలిగి ఉంది.

రెండు ఫోన్లు LPDDR 4 X  ర్యామ్ మరియు UFS 3.0 స్టోరేజ్‌తో పాటు 6.6-అంగుళాల IPS LCD డిస్‌ప్లేని ఒక 120 Hz రిఫ్రెష్ రేట్‌తో తీసుకొస్తుంది. ఈ రియల్మి  ఫోన్ 90.5% స్క్రీన్ టు బాడీ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. ఇవి 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,200 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉన్నాయి.

12MP రెగ్యులర్ టెలిఫోటో లెన్స్‌తో Realme X3

Realme X3 సిరీస్ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా కొత్త Realme UI తో నడుస్తుంది. ఇవి రెండు DolbyAtmos ఆడియోకు కూడా మద్దతు ఇస్తాయి.

కెమెరాల విషయానికొస్తే, ఈ రెండు స్మార్ట్‌ ఫోన్‌లు 64 MP  శామ్‌సంగ్ GW -1 సెన్సార్‌ను 26 MM , ఎఫ్ / 1.8 లెన్స్‌తో పాటు 8 MP  అల్ట్రావైడ్ కెమెరాతో పాటు ఎఫ్ / 2.3 లెన్స్, 2 MP మాక్రో లెన్స్‌తో రాక్ చేస్తాయి. ముందు వైపు, డిస్ప్లేలో రెండు సెల్ఫీ కెమెరాలు డ్రిల్లింగ్ చేయబడ్డాయి. ప్రాధమిక 32MP Sony IMX616 సెన్సార్ కాగా,  రెండవది అల్ట్రా-వైడ్ SonyIMX 471 f / 2.0 షూటర్.

ఇప్పుడు ఈ రెండు స్మార్ట్ ఫోన మధ్య తేడాలను గమనిద్దాం. Realme X3 SuperZoom మరియు Realme X3 కాకుండా వేరుగా ఉంచేది 8 MP ఎఫ్ / 3.4 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, ఇది 124 MM  మరియు 5 X  ఆప్టికల్ జూమ్ మరియు OIS ప్రత్యేకత కలిగివుంది. ఈ Realme X3 SuperZoom లోని టెలిఫోటో లెన్స్ ఆస్ట్రోఫోటోగ్రఫీ కూడా చేయగలదు. సంస్థ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అతిపెద్ద ముఖ్యాంశాలలో ఒకటి.

ఇక సాధారణ రెగ్యులర్ Realme X3 ఎఫ్ / 2.5 లెన్స్‌తో 12 MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. సాధారణ X3 యొక్క జూమ్ సామర్థ్యాలు ఇంకా తెలియలేదు.

ఎక్స్‌3 సిరీస్‌లో, రియల్‌మి ‌X 3 సూపర్‌జూమ్ 8 జిబి మరియు 12 జిబి ర్యామ్‌తో పాటు 128 జిబి మరియు 256 జిబి స్టోరేజ్‌తో వస్తుంది. మరోవైపు, రియల్‌మి ఎక్స్ 3 6 జిబి మరియు 8 జిబి ర్యామ్ వేరియంట్‌తో మరింత సరసమైనది, రెండింటిలో 128 జిబి స్టోరేజ్ ఉంటుంది.

Realme X3 SuperZoom  మరియు Realme X3  

రియల్‌మి ఎక్స్‌ 3 యొక్క 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ .24,999 ధరతో ఉండగా, 8 + 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ .25,999. ఇదిలా ఉండగా, ఫ్లాగ్‌షిప్ రియల్‌మి ఎక్స్‌ 3 సూపర్‌జూమ్ ధర 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌కు రూ .27,999 కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .32,999.

రియల్‌మి ఎక్స్‌ 3 జూన్ 25 నుంచి ఫ్లిప్‌కార్ట్, realme.com ‌లో విక్రయించనుండగా, ఎక్స్‌3 సూపర్‌జూమ్ జూన్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి వెళ్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo