Realme C12, C15 స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చెయ్యడానికి రియల్ మీ సిద్ధమవుతోంది
ఈ Realme C12, Realme C15 లాంచ్ ఈవెంట్ కోసం మీడియా ఆహ్వానాలను కూడా పంపింది.
Realme C12, C15 లాంచ్ ఈవెంట్ కోసం రియల్ మీ పంపించిన మీడియా ఆహ్వానం ద్వారా ఈ రెండు ఫోన్లను కూడా ఒక అతిపెద్ద 6000mAh బ్యాటరీతో తీసుకురానున్నట్లు కనిపిస్తోంది.
Realme C12, C15 స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదల చెయ్యడానికి రియల్ మీ సిద్ధమవుతోంది మరియు ఇప్పటికే ఈ లాంచ్ ఈవెంట్ కోసం మీడియా ఆహ్వానాలను కూడా పంపింది. అయితే, మహమ్మారి కారణంగా ఈవెంట్ కూడా వర్చువల్ లాంచ్ ఈవెంట్ అవుతుంది. ఆగస్టు 18 తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు, సంస్థ యొక్క అధికారిక యూట్యూబ్, ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది
Survey
✅ Thank you for completing the survey!
ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో Realme C15 గత నెలలో ఇతర మార్కెట్లలో లాంచ్ చెయ్యబడింది. అయితే, Realme C12 మాత్రం కొత్తది, దాని ఫీచర్లు గురించి ఎటువంటి సమాచారం తెలియరాలేదు. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో కూడా అతిపెద్ద 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ గురించి తెలిసిన విషయాలను గురించి చర్చిద్దాం.
Realme C12, C15 లాంచ్ ఈవెంట్ కోసం రియల్ మీ పంపించిన మీడియా ఆహ్వానం ద్వారా ఈ రెండు ఫోన్లను కూడా ఒక అతిపెద్ద 6000mAh బ్యాటరీతో తీసుకురానున్నట్లు కనిపిస్తోంది.
Realme C15: ప్రత్యేకతలు
Realme C15 గత నెలలో ఆవిష్కరించబడింది, కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు మనకు ముందే తెలుసు. ఈ రియల్ మీ సి 15 స్మార్ట్ ఫోన్ ఒక 6.5-అంగుళాల 29: 9 LCD డిస్‌ప్లేను హెచ్‌డి + రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్న వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రక్షించబడింది. వెనుకవైపు, ఈ స్మార్ట్ ఫోన్ లో 13 ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మోనోక్రోమ్ కెమెరా మరియు 2 ఎంపి డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్ కూడా ఉంది.
రియల్ మీ సి 15, MediaTek Helio G35 SoC తో పాటు జతగా 3 జిబి లేదా 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది. 6000 ఎంఏహెచ్ మొత్తం ప్యాకేజీకి అద్భుతమైన శక్తినిస్తుంది మరియు ఇది మైక్రో యుఎస్‌బి తో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Realme C12: ప్రత్యేకతలు
రియల్ మీ సి 12 యొక్క ప్రత్యేకతల గురించి చాలా తక్కువగా తెలుసు. మాకు పంపిన మీడియా ఆహ్వానం నుండి, ఈ స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని అర్ధమవుతోంది. ఇటీవలి Geekbench జాబితా 3 జిబి ర్యామ్ తో పాటు Helio P35 SoC తో పనిచేస్తునట్లు ఒక స్మార్ట్ ఫోన్ కనిపించింది, అది ఇదే కావచ్చు. అయితే ,కెమెరా, డిస్ప్లే మొదలైన మిగతా ఫీచర్లు మాత్రం ఇంకా గోప్యం గానే ఉన్నాయి.