Realme P4 Power top 5 features know here
Realme P4 Power స్మార్ట్ ఫోన్ ఫోన్ కాదు పవర్ బ్యాంక్ అని చమత్కారంగా చెప్పవచ్చు. ఎందుకంటే, రియల్‌మీ ఈ ఫోన్ ను ఏకంగా 10,001 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తుంది. కేవలం బ్యాటరీ మాత్రమే కాదు ఈ ఫోన్ వేగవంతమైన చిప్ సెట్ మరియు అద్భుతమైన విజువల్స్ అందించే డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది. మరి ఈ ఫోన్ కలిగిన టాప్ 5 ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా.
రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ మూడు సరికొత్త రంగుల్లో కూడా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఈరోజు తెలుసుకోండి.
ఈ అప్ కమింగ్ రియల్‌మీ స్మార్ట్ ఫోన్ అతిపెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇది ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ ఆరెంజ్ మరియు ట్రాన్స్ బ్లూ అనే మూడు సరికొత్త రంగుల్లో లాంచ్ అవుతుంది.
ఈ ఫోన్ లో బిగ్ 4D కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు HDR 10+ సపోర్ట్ మరియు Netflix HDR సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది స్టన్నింగ్ విజువల్స్ అందిస్తుంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 Ultra చిప్ సెట్ జతగా హైపర్ విజన్ ప్లస్ AI చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఈ సెటప్ తో గొప్ప విజువల్స్ తో కూడిన గేమింగ్ అందిస్తుంది.
Also Read: JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!
ఈ ఫోన్ వెనుక 50MP Sony IMX 882 ప్రధాన కెమెరా జతగా మరో రెండు కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ కలిగిన కెమెరా సెటప్ తో 4K వీడియో రికార్డింగ్, గొప్ప ఫోటోలు మరియు మంచి జూమ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
భారత మార్కెట్ ఎప్పుడు చూడని 10,001 mAh బిగ్ బ్యాటరీ తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ వేగంగా ఛార్జ్ చేసే 80W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ మరియు ఈ ఫోన్ తో ఇతర డివైజెస్ ను ఛార్జ్ చేసే 27W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది.